శ్రీకార్తీక_పురాణము 27వ అధ్యాయము…

శ్రీకార్తీక_పురాణము 27వ అధ్యాయము

|| దూర్వాసుడు అంబరీషుని అశ్రయించుట ||


మరల అత్రిమహాముని అగస్త్యునితో ఇలా చెప్పెను ” కుంభసంభవా! ఆ శ్రీహరి దూర్వసుని యెంతో ప్రేమతో జేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను –
” ఓ దూర్వాసమునీ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పదిజన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారములు ఎతుట కష్టముకాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను. కావున అందులకు నేను అంగీకరించితిని. బ్రహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవముండదు. ఇటు భక్తిలను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చితాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృత్తుడై ప్రాయోపవేశమెనర్ప నెంచినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నున్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మముగాని, ప్రజాపీడనము గాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ణానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించవలెను. ధనుర్భాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడు దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుటకంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసచేయువాడును బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామమునుండి తరిమినవాడును, విప్ర పరిత్యగమొనరించువాడును బ్రహ్మహంతకులే అగుదురు. కావున ఓ దూర్వాస మహార్షి! అంబరీషుడు నీ గురించి తపశ్శాలియు, విప్రోత్తముడును అగి దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటము పొందుచున్నాడు అయ్యో! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే అని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి నీవు వేగమే అంబరీషుని వద్దకువెళ్లుము, అందువలన మీ ఉభయులకు శాంతి లభించును” అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను.

27వరోజు పారాయణము సమాప్తము

కార్తీకమాస 27వ రోజు ఆచరించవలసిన దానధర్మలు – జపతపాది విధులు – ఫలితములు

పూజించాల్సిన దైవము → కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము → ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా
నిషిద్ధములు → ఉల్లి, ఉసిరి, వంకాయ
దానములు → ఉసిరి, వెండి, బంగారము, ధనం, దీపాలు
ఫలితము → మహాయోగం, రాజభోగం, మోక్షసిద్ధి

About The Author