ఆఫీసులో వ్యవసాయం…


ఆ ఏడంతస్తుల భవనంలోని ఓ కార్యాలయానికి వెళ్తే ఓ పక్క పచ్చని వరి పైరు ఆహ్వానం పలుకుతుంటుంది. మరోపక్క రకరకాల పూలు సువాసనల్ని వెదజల్లుతుంటాయి. గదుల్లో బెండ, టొమాటో, వంగ తదితర కూరగాయల మొక్కలు సీలింగ్‌ మెష్‌ నుంచి వేలాడుతూ అబ్బురపరుస్తాయి. ‘కార్యాలయమేంటీ… తోటలేంటీ…’ అన్నదేనా మీ సందేహం… టోక్యోలోని ఓ భవనంలో ఉన్న పసోనా గ్రూప్‌ కార్యాలయంలో 2010 నుంచి ‘అర్బన్‌ ఫామ్‌’ పేరిట కూరగాయలూ, పండ్లూ, పూల మొక్కలూ పెంచుతున్నారు. వసారాలోని కొంత భాగంలో వరి సాగు చేస్తున్నారు. ఇక్కడ పండే కూరగాయలూ, పండ్లతోనే క్యాంటీన్‌లో ఉద్యోగులకు అవసరమైన ఆహార పదార్థాల్ని తయారు చేసి అందిస్తారు. ఉద్యోగులు ప్రశాంత వాతావరణంలో పనిచేయడంతోపాటు తమ ఇళ్ల వద్ద కూడా తోటల్ని పెంచుకోవాలన్న ఆసక్తి కలిగించడానికే యాజమాన్యం ఈ విధానాన్ని అనుసరిస్తోందట..!

About The Author