శ్రీకార్తీక పురాణము 11వ అధ్యాయము


మంథరుడు – పురాణమహిమ

ఈ #కార్తీకమాసవ్రతము ఒక్క మహాత్యము గురించి ఎంత చెప్పినా, విన్న తనివితీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పుజించినయెడల చాంద్రయణవ్రతము చేసినంత ఫలము కలుగుతుంది. విష్య్ణర్చన అనంతరం పురాణపఠనము చేసిన, చేయించిన, వినినా, వినిపించినా అటువంటివారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీని గురించి మరొక ఇతిహాసము ఉంది.
పూర్వము కలింగదేశంలో మంధరుడు అనే విప్రుడు కలడు. అతడు ఇండ్లలో వంటచేసి అక్కడే భుజిస్తూ, మద్యమాంసాది పానీయలు సేవిస్తూ, తక్కువజాతి వారి సాంగత్యం వలన స్నాన జప, దీపారాధనాదికాలు ఆచారాలను పాటించక దురాచారుడై మెలిగేవాడు. అతని భర్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు, భర్తయెంత దుర్మార్గుడైననూ, పతినే దైవంగాభావించి విసుగుచెందక సకలోపచారాలుచేస్తూ, పతివ్రతధర్మని నిర్వర్తించేది. మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడిగా పనిచేస్తున్ననూ ఇల్లు గడవక చిన్నవర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దానివలన కూడా పొట్టగడవకపోవడం వల్ల దొంగతనాలు చేస్తూ దారికాసి బాటసారులను బాధించి వారి వద్ద వున్న ధనన్ని, వస్తువులను అపహరిస్తు జీవించేవాడు. ఒకరోజున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన బడి పోతుండగా బయపెట్టి, కొట్టి ధనాన్ని అపహరిస్తుండగా అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనమును మూటగట్టుకొని వచ్చుచుండెను. సమీపంలోని ఒక గుహనుండి వ్యాఘ్రమొకటి గాండ్రిస్తూ వచ్చి కిరాతకునిపై పడగా కిరాతకుడు దానిని కూడా చంపెను. కాని ఆ పులికూడా తన పంజాతో కిరాతకుని కొట్టడంవల్ల ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధంగా ఒకే కాలంలో నలుగురు నాలుగు విధాలుగా హత్యలు చేసి చనిపోయినందువలన ఆ నలుగురు కూడ యమలోకంలో అనేక శిక్షలు అనుభవిస్తూ రక్తము క్రక్కుతూ బాధపడుచుండిరి.
మంధరుడు చనిపోయిననాటినుండి అతని భర్య నిత్యము హరినామస్మరణ చేస్తూ సదాచారవర్తినియై భర్తను తలచుకొని దుఃఖిస్తూ కాలం గడుపుతుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వనించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి ” స్వామీ! నేను దీనురాలను, నాకు భర్తగాని, సంతతిగాని లేరు. నేను కూడా సదా హరినామస్మరణ చేస్తూ జీవిస్తూన్నదాని కావున నాకు మోక్షమార్గని ప్రసాదించండి” అని బ్రతిమాలుకొనెను. ఆమె వినయానికి, ఆచారానికి ఋషి సంతోషించి ” అమ్మా! ఈ దినము కార్తీకపౌర్ణమి, చాల పవిత్రమైన దినము. ఈ దినము వృథగా పాడుచేదుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుతారు నేను చమురు తీసుకుని వస్తాను. నీవు ప్రమిదను, వత్తిని తీసుకుని రావలయును. దేవాలయంలో ఈ వత్తిని దెచ్చిన ఫలమును నీవంతుగాకొనుము” అని చెప్పగా ఆమె సంతోషించి, వేంటనే దేవాలయానికి వెళ్లి శుభ్రంచేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తిచేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిననూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను. అటు తరువాత ఇంటికి వెళ్లి తనకు కనిపించినవారందరికీ ” ఈరోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపనికి రమ్మని” చెప్పెను. ఆమె కూడా రాత్రంతా పురాణము వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణుచింతతో కాలము గడుపుతూ కొంతకాలనికి మరణించెను. ఆమె పుణ్యత్మురాలగుటచేత విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠనికి తీసుకుపోయారు. కాని ఆమెకు పాపత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముండుటచేత మార్గమధ్యలో యమలోకానికి తీసుకుపోయిరి. అచట్ఙ్ నరకమందు మరిముగ్గురితో బాధపడుచుంన్న తన భర్తను చూసి “ఓ విష్ణుదూతలారా! నా భర్తా, మరి ముగ్గురునూ యీ నరకబాధపడుతున్నారు కవున నా యందు దయవుంచి వారిని ఉద్దరింపుము” అని ప్రాదేయపడెను. దానికి విష్ణుదూతలు” అమ్మ! నీభర్త బ్రాహ్మణుడై వుండి కూడా స్నానసంధ్యాదులు మాని పాపాత్ముడైయ్యడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైవుండి అతను కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనం అపరించెను. మూడవవాడు వ్యాఘ్రము, నాలుగవ వాడు పూర్వము ద్రవిడ దేశంలో బ్రాహ్మణుడై పుట్టినా అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము, మద్య మాంసభక్షణ చేసాడు. కావున పాపాత్ముడైయ్యడు. అందుకే ఈ నలుగురూ నరక బాధలు పడుతున్నారు”. అని ఆ నలుగురి చరిత్రలు చెప్పిరి. అందుకామె చాలా విచారపడి “ఓ పుణ్యత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్దరింపుము.” అని ప్రార్థించగా దానికి దూతకు ” అమ్మా! కార్తీక శుద్దపౌర్ణమినాడు నీవు వత్తిచేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిదెఫలము కిరాతకునికి, పురాణశ్రవణఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి మోక్షము కలుగును. అని చెప్పగా అందుకామె అట్లే దారపోసెను. అ నలుగురు కూడా ఆమె దగ్గరికి వచ్చి విమానమెక్కి వైకుంఠనికి వెళ్లారు.
కావున మీరు కూడా తప్పక కార్తీకమాసంలో పురాణపఠణం లేదా శ్రవణం, దీపము వెలిగించడం వలన ఏంతో పుణ్యఫలం పొందుతారు.

పదకొండవ రోజు పారాయణ

◆◆◆◆◆◆◆◆◆◆◆
కార్తీక మాస పదకొండవ రోజ దానధర్మ జపతపాది విధులు – ఫలితాలు

పూజించాల్సిన దైవము → శివుడు
జపించాల్సిన మంత్రము → ఓం రుద్రయస్వాహా, ఓం నమశ్శివాయ
నిషిద్ధములు → పులుపు, ఉసిరి
దానములు → వీభూదిపండ్లు, దక్షణ
ఫలితము → ధనప్రాప్తి, పదవీలబ్ధి?

About The Author