పెట్రోలు అయిపోయిందని 100కు ఫోన్ చేసిన యువతి…
రాచకొండ : ప్రయాణం మధ్యలో పెట్రోలు అయిపోయిందంటూ ఓ యువతి 100కు డయల్ చేస్తే స్పందించిన పోలీసులు పెట్రోలు తెచ్చి పోశారు. హైదరాబాద్లో జరిగిందీ ఘటన. రాచకొండ పోలీసులు ట్విట్టర్లో పోస్టు చేసిన ఈ ఫొటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వరుస అత్యాచార ఘటనలతో ఉలిక్కిపడిన హైదరాబాద్లో పోలీసులు ఇప్పుడు పూర్తి అప్రమత్తంగా ఉన్నారని చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ.
రాచకొండ పరిధిలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఓ యువతి డయల్ 100కు కాల్ చేసి బండిలో పెట్రోలు అయిపోయి ఇబ్బంది పడుతున్న విషయం తెలిపింది. వెంటనే స్పందించిన పోలీసులు పెట్రోలు బాటిల్తో యువతి వద్దకు చేరుకున్నారు. స్కూటీలో వాహనం పోసి జాగ్రత్తలు చెప్పి పంపించారు. రాచకొండ పోలీసులు ఈ ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. యువతి ఫోన్కు స్పందించి సాయం చేసిన పోలీసులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.