‘‘మా బతుకుల్లో వెలుగులు నింపారు…మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేం“
https://www.facebook.com/TDP.Official/videos/1136955919800883/?t=93
‘‘మా బతుకుల్లో వెలుగులు నింపారు…పన్నెండేళ్ల మా నిరీక్షణ ఫలించేందుకు పూర్తి సహాయసహకారాలు అందించారు. మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేం“ అంటూ మంత్రి నారా లోకేష్ కి ఉపాధి హామీథకం ఫీల్డ్ అసిస్టెంట్లు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న దాదాపు 12 వేల మంది క్షేత్ర సహాయకులను ఫిక్స్‌డ్ టెన్యూర్ ఉద్యోగులుగా నియమిస్తూ ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏళ్లుగా సాగిస్తున్న తమ పోరాటానికి పూర్తి మద్దతునిచ్చి, న్యాయమైన డిమాండ్లను తీర్చిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీశాఖా మంత్రి నారా లోకేష్‌ని గురువారం ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద కలిసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉపాధి సిబ్బందిపై వరాల వర్షం కురిసింది. ఫిక్స్‌డ్ టెన్యూర్ ఉద్యోగులుగా గుర్తించడంతో రాష్ట్రవ్యాప్తంగా 12 వేల మందికి పైగా క్షేత్ర సహాయకులు, 288 ఆఫీస్ సబార్డినేట్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కలగడంతోపాటు అదనపు ప్రయోజనాలు అందనున్నాయి. అలాగే లిస్ట్ 2 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న జూనియర్ మేట్ల వేతనాలు 4500 నుండి 5500 పెంచి జులై 2018 నుంచీ ఇవ్వాలని నిర్ణయించారు. ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకులు, జూనియర్ మేట్లు,సీనియర్ మేట్ల ప్రమాదంలో చనిపోతే చంద్రన్న భీమాతో సంబంధంలేకుండా ఇచ్చే పరిహారం 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. ఉపాధిహామీ పథకంలో పని చేసే సిబ్బంది ప్రమాదంలో చనిపోతే చంద్రన్న భీమా 5 లక్షలు,పరిహారం 5 లక్షలు మొత్తంగా 10 లక్షలు ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి అని నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి అంత్యక్రియలకు ప్రస్తుతం ఇస్తున్న 5 వేల రూపాయల నుండి 15 వేలకు పెంచారు. ఉపాధి సిబ్బంది తల్లితండ్రులకు కూడా మెడికల్ రిఎంబర్స్మెంట్ వర్తింపు చేశారు. అలాగే సిబ్బందికి నగదు రహిత వైద్య సేవలు అందించేలా ఎన్టీఆర్ వైద్య సేవలో భాగంగా హెల్త్ కార్డ్స్ ఇవ్వనున్నారు.