చింతలపూడి ఎత్తిపోతల శరవేగంతో పూర్తవుతున్నాయి…

https://www.youtube.com/watch?v=kWkoHkcNz3E

గోదావరి నీటిని పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ఎత్తిపోసి, కృష్ణాడెల్టా రైతులకు సాగునీరు అందించినట్లే, అదే గోదావరి నీటిని ఎత్తిపోసి, నాగార్జున సాగర్‌ ఆయకట్టు మెట్టప్రాంత రైతులకు సాగునీరు ఇచ్చేందుకు ఉద్దేశించిందే చింతలపూడి ఎత్తిపోతల పథకం. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని తొమ్మిది నియోజక వర్గాల పరిధిలో ఉన్న 33 మండలాల మెట్టభూములకు వరం ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం. ఈ పథకం ద్వారా గోదావరి నీటిని 2 దశలలో ఎత్తిపోసి, చింతలపూడి ప్రధాన కాలువకు మళ్ళిస్తారు. ఈ కాలువను సాగర్‌ ఎడమ కాలువకు ఒక లింకు కెనాల్‌ ద్వారా కలిపి నిర్దేశిత ఆయకట్టుకు నీటిని అందిస్తారు. రూ. 4,909.80 కోట్లు ఖర్చుతో దాదాపు 4.80 లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు నిర్మిస్తోన్న చింతలపూడి ఎత్తిపోతల శరవేగంతో పూర్తవుతున్నాయి.

About The Author