రైతు కి శిరస్సు వంచి.. పాదాభివందనం…

రైతు కి శిరస్సు వంచి.. పాదాభివందనం ఈ రోజు మన ఇలా వున్నాం అంటే రైతే గొప్పదనము.. ఆరుబడి కాలం అంత కష్టపడి పండించిన పంట సుఖం గా తింటున్నాము అంటే రైతు కష్టమే అని అందరికి తెలుసు కానీ ఈ ప్రభుత్వాల వల్ల, సిండికేట్ మాఫియా ల వల్ల రైతు కుదేలు అవుతున్నారు. కానీ ఈ ప్రభుత్వాలు చేసే పనులు రోజు రోజు కి దిగజారుతున్నాయి. ఎందుకంటే రుణమాఫీ అని చెప్పి యేవో మాయలు చేయటం ఓట్లు వేయించుకోటం తర్వాత బడ్జెట్ లేదు అనటం పరిపాటి అయిపొయింది.. లేదా మొక్కుబడి గా చెయ్యటం జరుగుతుంది. రుణ మాఫీ కూడా పెద్ద వాడికే గాని పేద వారికి అందటం కానీ ఉపయోగం కానీ బహు తక్కువ. పెద్ద పెద్ద ఆర్ధిక వేత్తలు రుణ మాఫీ వద్దు మొర్రో అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు.. ఇన్ని లక్షల కోట్లు పెద్ద వాడికి పొసే బదులు ఆ డబ్బు తో రైతు కి సరి అయిన మంచి సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, మద్దతు ధర, రైతు కి తక్కువ వడ్డీకి రుణ సౌకర్యం, వరదలు వచ్చినప్పుడు రైతు ని ఆదుకునే ఫండ్, ఇవన్నీ కల్పిస్తే ఏ రైతుకి మీ ముష్టి అవసరం ఉండదు.. ఏ రైతు ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్యం ఉండదు. రైతు కూడా సంతోషం గా అప్పు తీర్చ గలడు … ఏ రాష్ట్రము మీద ఆర్ధిక ప్రభావం పడదు ఈ డబ్బు తో రాష్ట్రాభి వృద్ధి కి ఉపయోగించవచ్చు .. మీకు ఎంత సేపు ఓట్ల మీద, అధికారం మీద వున్న శ్రద్ద దేని మీద ఉండదు.. చాల మంది పిచ్చోళ్ళకి ఇలాంటి వాటి మీద శ్రద్ద ఉండదు పార్టీలు, మా హీరో , మా కులం ఇవే కావాలి. ఎన్నికల్లో ఊళ్ళల్లో కొట్టుకోవటం కేసులు పెట్టుకోవటం, చంపుకోవటం, పగలు పెంచుకోవటం ఇలాంటివి తప్పితే ఇంకోటి జరగటం లేదు రోజు రోజు కి కలుషితం అయిపోతున్నాయి ఇంకా ఏమి సాదిద్దాం …… సాధిస్తాం

About The Author