త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి భార్య…
నా పక్కనున్న పెద్దాయన పేరు సిరివెన్నెల శ్రీరామశాస్త్రి (ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సోదరుడు). ఆపక్కన వాళ్ల అమ్మాయి సౌజన్య. ఆమె ఎవరో కాదు ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి భార్య.తొలుత త్రివిక్రమ్ కు తన అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చెయ్యడానికి శ్రీరామశాస్త్రి గారు వెనకాడారంట.అయితే ఆయన ఖచ్చితంగా మంచి దర్శకుడు అవుతాడని నచ్చజెప్పి సీతారామశాస్త్రి గారు వారి వివాహం జరిపించారంట.పెళ్ళి జరిగిన మర్నాడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తొలి సినిమా “నువ్వే నువ్వే ” విడుదలై ఘనవిజయం సాధించింది. ఈరోజు పల్ల వెంకన్న గారి నర్సరీలో కలుసుకున్నప్పుడు త్రివిక్రమ్ మామగారు ఆనంద బాష్పాలతో అల్లుడు గురించి చెప్పిన విషయాలివి..