2020ప్రముఖ లేడీ సింగర్ ఆత్మహత్య..! వారిని అస్సలు వదలద్దు అని ఆ నోట్ లో రాసింది!


కన్నడ ప్లేబ్యాక్ సింగర్ సుస్మిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త అత్త మామ
ల వేధింపులే కారణమని ఆమె ఆత్మహత్యకు ముందు తన తమ్ముడికి వాట్సాప్‌ మెసేజ్‌ పంపారు. బెంగళూరులోని నాగరబావి ఇంటిలో ఉరి వేసుకుని చనిపోయారు.
శరత్, అతని సోదరి గీతా, అతని అత్త వైదేహీలు తనను వేధించారని.. వీరే తన ఆత్మహత్యకు కారణమని వాట్సాప్‌ మెసేజ్‌లో ఆమె చెప్పుకొచ్చింది. అదనపు కట్నం తేకుంటే ఇల్లు వదిలి వెళ్లిపోవాలని తనను పలుమార్లు వేధించారని, అందుకే ఆ ఇంటిలో చనిపోవడం కూడా ఇష్టం లేకే పుట్టింటికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నానని సుస్మిత వాట్సాప్ మెసేజ్‌లో ఉంది. తనను క్షమించాలని ఆ సూసైడ్ నోట్‌లో తల్లిని కోరింది.
అంతేకాదు తనను ఇంతలా వేధించిన తన భర్తను, అతని కుటుంబసభ్యులను కఠినంగా శిక్షించాలని, అప్పుడే తన ఆత్మ శాంతిస్తుందని ఈ సందర్భంగా సుస్మిత తన మెసేజ్‌లో రాసింది. కన్నడ ఇండస్ట్రీలో పలు సినిమాలు, సీరియల్స్ కి పాటలు పాడుతూ గాయకురాలిగా రాణిస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సుస్మిత ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడి వారంతా ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురయ్యారు

About The Author