దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి యాత్ర…
దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పాద యాత్ర చేశారనే విషయం మాత్రమే తెలుగు ప్రజలకి తెలుసు కాని ఆ పాదయాత్ర తన రాజకీయ యాత్ర లో ఎంత కీలకమే కొంతమందికే తెలుసు. అప్పటి రాజకీయ అనిశ్చితి దృష్ట్యా ఆయన ప్రజలకి దగ్గరగా వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొవటానికి ఈ యాత్ర మెదలుపెట్టారు.. కాని ఆ యాత్రలో ఎన్ని విషయాలు ఆయన ఎంత దగ్గరగా చూశారో, సాదారణమైన కష్టాలు కూడా తీర్చుకోలేని అతి సామాన్యుల్ని ఎలా కలిసారో, పేదవారంటే ఎవరొ.. వారు దేనికొసం చూస్తున్నారొ ఆయన ప్రత్యక్షంగా చూశారు. ఆయన మనసు చలించిపోయింది. జనంతో మమేకమై వారిలోని భావోద్రేకాన్ని అర్దంచేసుకుని తన యాత్ర ని కొనసాగించారు. ఈ యాత్ర కొనసాగింపు నుంచి ముగింపు వరకూ వున్న ఘట్టాన్ని తీసుకుని మహి వి రాఘవ అత్యద్బుతంగా అత్యంత సున్నితమైన సన్నివేశాలతో, ఆద్యంతం భావోద్రేక సంఘటనలతో చిత్రం చూస్తున్నంత సేపు వై యస్ గారు మడమ తిప్పని వైనం ఆయనకి పేదలంటే ఎంత ప్రాణమో ఈ చిత్రం లో కల్లకు కట్టినట్టు చూపించారు.
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో జీవిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ తో ఈ విషయం స్పష్టమైంది. మొదటి సింగిల్ సాంగ్ తో యాత్ర స్టోరీ లోని హై ఇంటెన్సిటీ చూపించారు. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు మహి వి రాఘవ్ ఈ బయెపిక్ ని తెరకెక్కిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మళయాలంలో కూడా యాత్ర చిత్రాన్ని ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తున్నారు.