ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు నిల్వ నీటిని ఖాళీ చేయాలి…


కెటిఆర్ కొత్త టాస్క్.. హైద‌రాబాద్ – రాబోయే రోజులలో వచ్చే సీజనల్ జబ్బు లైన చికున్ గున్యా, డెంగ్యూ, ఇతర జబ్బులను అరికట్టడానికి పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోరారు. హైదరాబాద్ నుండి అదనపు కలెక్టర్‌లు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో వచ్చే సీజనల్ వ్యాధులు చికెన్ గున్యా, డెంగ్యూ, ఇతర వ్యాధులను అరికట్టడానికి దోమలను లార్వా దశలోనే వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడానికి నీటి నిల్వలను ఖాళీ చేయడానికి ప్రతి ఆదివారం ఉదయం పదిగంటలకు 10 నిమిషాల పాటు క్యాంపెయిన్ పద్ధతిలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది అందరూ వారి వారి గృహాలలో ఉన్న నీటి నిల్వలను అంటే కూలర్లులలో నిల్వ ఉన్న నీళ్లు, పాత్రలలో ఉండే నీళ్లు, ఇంట్లో నీటి నిలువ ఉండే ప్రాంతాలు అన్ని చోట్లలో ఉన్న నీటిని ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పదినిమిషాల పాటు వారి ఇళ్లలో ఖాళీ చేసి దోమల లార్వాలను వ్యాప్తి చెందకుండా చూడాలని మంత్రి కోరారు. ప్రజలకు అవగాహన కల్పించి వారిని కూడా జాగ్రత్త చర్యలు తీసుకునేలా ప్రోత్సహించాలని మంత్రి సూచించారు.

About The Author