టకోమా నగరం లోని కమ్యూనిటీ మరియు ఎకనామిక్ డెవలప్ మెంట్ …
టకోమా నగరం ( వాషింగ్టన్) లోని కమ్యూనిటీ మరియు ఎకనామిక్ డెవలప్ మెంట్ డిప్యుటీ మేయర్ శ్రీ అండర్స్ ఇబ్సెన్ (Anders Ibsen) మరియు ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ డెబ్లె బింఘం (Debble Bingham) ప్రతినిధుల బృందం ఈ రోజు పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ తో మంగళ వారం సెక్రటేరియట్ లో సమావేశం అయింది. తెలంగాణ రాష్ట్ర T.S. i-pass సింగల్ విండో విధానం దేశంలోనే ఎక్కడా లేని విధంగా చాలా బాగా అమలవుతోందని ఈ బృందం మెచ్చుకుంది. ఈ సందర్భంగా తెలంగాణా రాష్ట్రం పరిశ్రమలు మరియు సాంకేతిక విజ్ఞాన (I.T.) రంగాలలో ముందంజ లో ఉన్న కారణాలు శ్రీ జయేష్ రంజన్ ను అడిగి తెల్సుకున్నారు. పరిశ్రమలు, సాంకేతిక విజ్ఞానం శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ ప్రభుత్వ పథకాలైన T.S. i-Pass, ఇoడస్ట్రియల్ విధానం, సబ్సిడీలు, టెక్నికల్ మ్యాన్ పవర్, TASK గురించి టకోమా బృందానికి వివరించారు.T-Bridge policy క్రింద మనరాష్ట్రంతో భాగస్వామ్యం అవడానికి టకోమా బృందo వారు ఆసక్తి చూపించారు. ఈ T-Bridge policy ద్వారా కంపనీలు, క్రొత్త స్టార్టప్స్ పరస్పర మార్పిడికి అవకాశం లభిస్తుంది.