16 ఎంపీ సీట్లు గెలుస్తాం: ఎంపీ కవిత…
16 ఎంపీ సీట్లు గెలుస్తాం: ఎంపీ కవిత
అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘనవిజయం సాధించబోతున్నదని, రాష్ట్రంలో 16 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి ఢిల్లీ రాజకీయాల్లో కీలకప్రాత పోషిస్తామని ఎంపీ కవిత పేర్కొన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. మొన్నటి వరకు ఈవీఎంల ట్యాంపరింగ్ అన్న కాంగ్రెస్ నేతలు.. ఇవాళ ఓటమికి చంద్రబాబును సాకుగా చూపిస్తున్నారని దుయ్యబట్టారు. పెండింగ్లో ఉన్న అన్ని అంశాలపై కేంద్రంపై పోరాటం చేస్తాం.
పెండింగ్లో ఉన్న అన్ని అంశాలపై కేంద్రంపై పోరాటం చేస్తామని కవిత చెప్పారు. ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెసోళ్లు కుంటిసాకులు చెబుతున్నారు. ఎన్నికల్లో కూటమి హామీలను రాష్ట్ర ప్రజలు విశ్వసించలేదు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా టీఆర్ఎస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతాయి… టీఆర్ఎస్ కీలకంగా మారబోతోందని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు