నన్ను చాలా మంది పడకగదికి రమ్మన్నారు: షాకింగ్ కామెంట్స్
సినీ పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ గురించి తెలుగమ్మాయి తేజస్వి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్లో 90 శాతం కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పింది. కమిట్మెంట్లకు ఓకే చెబితేనే అవకాశాలు వస్తాయని కుండబద్దలు కొట్టింది. తనను ఎంతో మంది నేరుగా పడకగదికి ఆహ్వానించారని, తను అందుకు ఒప్పుకోకపోవడం వల్లే విజయవంతం కాలేకపోయానని ఆమె చెప్పింది. తేజస్వి ఇటీవల `కమిట్మెంట్` అనే సినిమాలో నటించింది. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఛానల్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసింది.
సినిమా ఇండస్ట్రీలో 90శాతం కాస్టింగ్ కౌచ్ ఉంది. ఆ చెత్తనంతా దాటిన తర్వాతే అసలైన ఇండస్ట్రీ మనుషులుంటారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్లు ముందుగానే కమిట్మెంట్లకు ప్రిపేర్ అయి వస్తున్నారు.ఆ క్యాటగిరీలో మనం ఉంటే ముందుకు సాగుతాం. నాకు తెలిసిన హీరోయిన్లు చాలామందికి కాస్టింగ్ కౌచ్ అనుభవాలున్నాయి. కానీ, వారెవరూ బయటకు చెప్పుకోరు. బాంబే హీరోయిన్స్ దేనికైనా ఒప్పుకొంటారనే ఏకైక కారణంతో వారికి అవకాశాలిస్తారు.
బాంబే అమ్మాయిలు కమిట్మెంట్లకు మానసికంగా సిద్ధపడి వస్తారు. ఈ విషయం తెలుగు అమ్మాయిలకు, తమిళ అమ్మాయిలకు కూడా తెలుసు. కమిట్మెంట్కు రెడీ అంటే అవకాశం ఇచ్చేవాళ్లు చాలామంది ఉన్నార`ని తేజస్వి చెప్పింది.