ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు మార్గదర్శకంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇండస్ట్రియల్ పాలసీ
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు మార్గదర్శకంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇండస్ట్రియల్ పాలసీ అత్యంత సమర్థంగా అమలు అవుతోందని, ఇది తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమని పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర హోం మరియు పరిశ్రమల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ నేతృత్వంలోని బృందం, పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ తో సచివాలయంలో బుధవారం సమావేశమైంది. పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ అబిద్ హుస్సేన్ (Mr. Abid Hussain), పరిశ్రమల శాఖ డిప్యుటీ డైరెక్టర్ శ్రీ అనిల్ కుమార్ (Anil Kumar) తదితరులు అయిదుగురు సభ్యులు గా గల ఈ బృందం T.S. i – PASS మరియు తెలంగాణలో పెట్టుబడుల అధ్యయనానికై హైదరాబాదు కు వచ్చింది. ఈ బృందం తెలంగాణ రాష్ట్రం లో మాదిరిగా తమ రాష్ట్రంలో కూడా ఇండస్ట్రియల్ పాలసీని రూపొందిస్తామని అన్నారు. భారత దేశంలోని రాష్ట్రాలలోనే కాకుండా, ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులకు అనుకూలంగా ఉందని ప్రశంసించారు. తెలంగాణ లో పెట్టుబడులు ఆకర్షించడానికి “ఇన్వెస్ట్ మెంట్ తెలంగాణా సెల్” మెంబర్లు బాగా కృషి చేసి, పెట్టుబడులు రాష్ట్రానికి అధికంగా తీసుకొచ్చారని అభినందించారు.ఈ బృందం “ఇన్వెస్ట్ మెంట్ తెలంగాణా సెల్” మరియు “T.S. i – PASS” సభ్యులను షిమ్లాకు పంపించాలని, అక్కడ కూడా టీమును ఏర్పాటు చేయుబకు సహకరించాలని పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ ను ఈ సందర్భంగా కోరింది. హిమాచలప్రదేశ్ లో జూన్ 2019 లో నిర్వహిoచబోయే “ఇన్వెస్టర్ మీట్ ” లో పాల్గొనేందుకు పరిశ్రమలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ ను బృందం సభ్యులు ఆహ్వానించారు. తమ పర్యటన లో భాగంగా ఈ బృందం పరిశ్రమల శాఖ కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించింది.