ఆగస్ట్ 12 వరకూ రెగ్యులర్ ట్రైన్లను రద్దు రైల్వే శాఖ నిర్ణయం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత్లో రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 12 వరకూ రెగ్యులర్ ట్రైన్ సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్ట్ 12 లోపు రెగ్యులర్ ట్రైన్లలో ప్రయాణించేందుకు జూలై 1 నుంచి ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి.. టికెట్లను రద్దు చేసి పూర్తి రిఫండ్ చెల్లిస్తామని స్పష్టం చేసింది.అయితే.. ఇప్పటికే దేశవ్యాప్తంగా రాకపోకలు సాగిస్తున్న 230 ప్రత్యేక రైళ్లు యథావిధిగా నడుస్తాయని రైల్వే శాఖ తెలిపింది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో రెగ్యులర్ రైళ్లను నడపకపోవడమే శ్రేయస్కరమని భావించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది