అర్హత ఉన్న వారందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలి సిఎం జగన్ గారు

చిత్తూరు జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8న న అర్హత ఉన్న వారందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిందని ఇందుకు సంబంధించిన స్థలాలను చదును చేయడం ప్లాట్లుగా విభజించి రోడ్లు వేయడం  లాటరీ ద్వారా కేటాయించడం వంటి పనులు రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ గుప్తా శుక్రవారం సాయంత్రం మండల తాసిల్దార్ లకు ఆర్డీవోలకు సూచించారు. జిల్లా సచివాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇళ్ల స్థలాల కేటాయింపు సంబంధించి తహసీల్దార్లు ఆర్ డి వో లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 133496 మంది స్థలాలను పొందేందుకు అర్హులు గా గుర్తించారని ఇందుకోసం మూడు వేల ఇరవై ఆరు ఎకరాలు చదును చేయడం జరిగిందని ఈ భూమిలో 1951 ఎకరాలు ప్రభుత్వ భూమిని తొమ్మిది వందల ఆరు ఎకరాల భూ సేకరణ ద్వారా సేకరించామని 180 ఎకరాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంటేషన్ పూర్తయ్యాయని రెండు రోజుల్లో దీనిని కూడా చదును చేయడం పూర్తిచేసి ప్లాట్లుగా విభజించి పనులు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎక్కడ ఇంకా పెండింగ్ ఉన్న మండలాలు రెండు రోజుల్లో పూర్తిగా పనులు చేయాలని ఆదేశించారు ఇప్పటికే దాదాపు అన్ని మండలాల్లో భూసేకరణ చదును చేయడం ప్లాట్లుగా విభజించి మంచి పనులు దాదాపు పూర్తయ్యాయని పట్టణ ప్రాంతాల్లో కొంత  పెండింగ్లో ఉన్నాయని దానిని కూడా ఆయా రెవెన్యూ డివిజన్ అధికారులతో కలిసి పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్లాట్ల కేటాయింపులో కోసం లాటరీలు నిర్వహించాల్సి ఉందని ఆ బ్యాటరీలు కూడా పూర్తి చేయాలనిఅన్నారు. రూరల్ ప్రాంతంలో 30 అడుగులు రోడ్లు ఉండేటట్లు చూడాలని అదేవిధంగా చెట్లు నాటే ఎందుకు గుంతలు తీసే కార్యక్రమం ఆరో తేదీ లోపల పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. ఇటీవల కొత్తగా కొంత మంది దరఖాస్తు చేసుకున్నారని కొంత మంది తాసిల్దారు అడిగిన ప్రశ్నకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది అని అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందని రానున్న కాలంలో వారికి అర్హతను బట్టి తిరిగి కేటాయించడం కూడా జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. అదేవిధంగా గ్రామ సచివాలయాలు వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లకు రైతు భరోసా కేంద్రాలకు ఫలాలు రెండు రోజుల్లో కేటాయించాలని ఇంకా చిత్తూరు డివిజన్లో 6 గ్రామ సచివాలయాలుకు మదనపల్లి డివిజన్ లో 11 చోట్ల,తిరుపతి డివిజన్ లో 29 చోట్ల కేటాయించాల్సి ఉందని అదేవిధంగా వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ లకు చిత్తూరు డివిజన్ లో 32 చోట్ల, మదనపల్లి డివిజన్ లో 10 చోట్ల, తిరుపతి డివిజన్ లో 69 చోట్ల స్థలాలు ఇవ్వాల్సి ఉందిఅని అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలకు మదనపల్లి డివిజన్ లో నాలుగు చోట్ల చిత్తూరు డివిజన్ లో తొమ్మిది చోట్ల తిరుపతి డివిజన్ లో అరవై రెండు చోట్ల ప్రాణాలు కేటాయించాల్సి ఉందని వీటన్నిటిని వెంటనే కేటాయించాలని వచ్చేవారం వచ్చే వారం పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా తోపాటు జాయింట్ కలెక్టర్ మార్కండేయులు డిఆర్ఓ ఇంచార్జ్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

About The Author