34 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం: శేషాచలం అడవుల్లో తమిళ స్మగ్లర్లు కలకలం
కరోనా నేపథ్యంలో కొంతకాలం విరామం తరువాత తమిళ స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో కి ప్రవేశించారు. శనివారం ఉదయం 4.00 గంటలకు 34 ఎర్ర చందనం దుంగలను మోసుకెళుతూ ఉండగా, టాస్క్ ఫోర్స్ సిబ్బంది అడ్డగించారు. దీంతో దుంగలను పడేసి చీకట్లో కలిసిపోయారు. మూడు రోజుల క్రితం కొందరు తమిళ స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో ప్రవేశించి నట్లు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రవి శంకర్ గారికి సమాచారం అందింది. ఆయన వెంటనే ఆర్ ఎస్ ఐ వాసు బృందాన్ని అడవుల్లో కి పంపించారు. రెండు రోజుల నుంచి కూంబింగ్ చేపట్టిన వాసు బృందానికి శనివారం ఉదయం స్మగ్లర్లు తారసపడ్డారు. దీనిపై టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ శ్రీ రవి శంకర్ విలేకరులతో మాట్లాడుతూ దాదాపు 25 మంది స్మగ్లర్లు మోటారు సైకిల్ లపై ముగ్గురు చొప్పున వచ్చి నట్లు తెలిసిందని చెప్పారు. అయితే వీరిని పట్టుకునే ప్రయత్నం చేయగా, రాళ్లు రువ్వి సిబ్బంది పై తెగబడ్డారని అన్నారు. దుంగలు, వారు వెంటతెచ్చుకున్న బ్యాగులు పడేసి పారిపోయారని తెలిపారు. 34 దుంగలు 1.5 టన్నుల బరువు ఉంటుందని. కోటి రూపాయల పైగా విలువ ఉంటుందని అన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ వెంకటయ్య, సిఐ సుబ్రహ్మణ్యం,