గోదారోళ్లు ఏంచేసినా ఎరయిటగా ఉంటాదండి…

మా గోదారోళ్లు ఏంచేసినా ఎరయిటగా ఉంటాదండి.
ఈ బోగి పిడకల దండ అలాంటిదేనండి.పశుపోషణలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తూ.గో.జిల్లా ఆలమూరు మండల గుమ్మిలేరులో 1560 మీటర్ల పొడవైన ఈదండను నెల రోజుల పాటు 60 మంది మహిళలు కష్టపడి తయారు చేసారండి..ఇది దేశంలో అత్యంత పొడవైన దండగా గుర్తించి భారత బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటి కల్పించారండి..ఈ మేరకు సర్టిఫికేట్ కూడా అందించారండీ..
గత సంక్రాంతికి 500 మీటర్ల పొడవైన భోగి దండను తయారు చేస్తే న్యూస్ చానల్స్ పత్రికలు,సోషల్ మీడియా లో పెద్ద చర్చే జరిగింది.ఆ దండను మహిళలు తీసుకెళుతుంటే ఆరు నిమిషాల వీడియో వచ్చింది. మరి ఈ 1560 మీటర్ల దండను భోగి మంటలో వేయడానికి ఎంతమంది ఉంటారో..? ఎంత సేపు తీసుకెళతారో వేసి చూద్దాం..

About The Author