నేడు ఈ నవ్వుల రారాజు పుట్టిన రోజు

నట కిరీటిగా…నవ్వుల పండిచే హాస్య హీరోగా తనకంటూ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో రాజేంద్ర ప్రసాద్. నేడు ఈ నవ్వుల రారాజు పుట్టిన రోజు , రాజేంద్రప్రసాద్ అసలు పేరు గద్దె రాజేంద్ర ప్రసాద్. 1956 జూలై 19న. కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసి తన గమ్యం వెతుక్కుంటూ ఎన్నో కష్టాలను ఎదుర్కోని… చిన్న చిన్న వేషాలతో సర్దుకు పోతూన్న రాజేంద్ర ప్రసాద్‌ తొలి చిత్రం 1977లోని స్నేహం. 1982లో వొచ్చిన మంచుపల్లకి చిత్రంతో బ్రేక్‌ వొచ్చింది. ఈ చిత్రానికి వంశీ డైరెక్టర్‌.ఆ తర్వాత ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు.

రాజేంద్రప్రసాద్ హాస్యాన్నే ప్రధానంశంగా తీసుకుని సినిమాలు చేసి, విజయం సాధించి, కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు.హాస్య బ్రహ్మ జంధ్యాలతో కలిసి రాజేంద్ర ప్రసాద్ చేసిన ‘రెండురెళ్ల ఆరు’, ‘అహనా పెళ్లంట’ మంచి పేరు తెచ్చి పెట్టాయి. లేడిస్ టైలర్, ఏప్రిల్ 1, మాయలోడు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. ఇ.వి.వి సత్యనారాయణ తీసిన సినిమాలో అప్పుల అప్పారావులో ఆయన పండించిన హాస్యం అందర్ని కడుపుబ్బ నవ్వించింది.క్విక్‌గన్‌మురుగన్‌ అనే ఆంగ్ల చిత్రం ద్వారా అంతర్జాతీయంగా కీర్తిని సాధించారు . ఎర్రమందారం , ఆ నలుగురు సినిమాలకు ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. ఇప్పటికి తన నటనతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు రాజేంద్రప్రసాద్ .

About The Author