వీఆర్వో కు లంచం కోసం భార్యా బిడ్డలతో రైతు బిక్షాటన …
వీఆర్వో కు లంచం కోసం భార్యా బిడ్డలతో రైతు బిక్షాటన ..ఇద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించిన పోలీసులు..
అధికారులకు లంచం ఇవ్వడం కోసం కుటుంబ సభ్యులతో కలసి భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన రైతు. రాజును , అతడి భార్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.. తమ పరువు తీస్తున్నాడంటూ రెవిన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అరెస్ట్ చేశారు..కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మాధవరం గ్రామానికి చెందిన వన్యం వెంకటేశ్వర్లు అలియాస్ రాజు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గౌరెడ్డికి ఇద్దరు కొడుకులు కాగా.. వారిలో వన్యం వెంకటేశ్వర్లు అలియాస్ రాజు రెండో కుమారుడు. వారసత్వంగా తనకు 25 ఎకరాల భూమి దక్కాల్సి ఉండగా, దీన్ని సమీప బంధువు ఆక్రమించాడని రాజు ఆరోపిస్తున్నాడు. తన భూమి తిరిగి ఇప్పించాలని రాజు కోరగా వీఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం వెలుగోడు పట్టణంలో రాజుతో పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలు చేతిలో గిన్నె పట్టుకొని.. మెడలో ఓ బ్యానర్ వేసుకుని భిక్షాటన చేయడం ప్రారంభించారు.
బ్యానర్‌పై ‘దయచేసి నాకు దానం చేయండి. డబ్బు చెల్లిస్తే ఏ పనైనా పూర్తవుతుంది. నేను అలా చేయలేకపోయా. కాబట్టి నా భూమిని కోల్పోయా. రెండేళ్ల నుంచి నా భూమి కోసం కష్టపడుతున్నా’ అని రాసి ఉంది. రాజు ఆరోపణల నేపథ్యంలో గురువారం ఆత్మకూరు సీఐ కృష్ణయ్య వెలుగోడు రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేపట్టారు. రాజు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. రాజు అనుభవంలో 2.15 ఎకరాల పొలం మాత్రమే ఉందని, దాయాదుల మధ్య వివాదాన్ని తమపై నెడుతున్నాడని ఆరోపించారు. ఆయన భూమికి సంబంధించి ఏమైనా సమస్య ఉంటే కోర్టుకెళ్లి తేల్చుకోవాలని తహసీల్దారు సూచించారు.
ఆంధ్ర లో అధికారుల అవినీతికి నిరసనగా భిక్షమెత్తిన రైతు.కర్నూల్ జిల్లాలో రోజురోజుకూ అధిక సంఖ్యలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వర్షాభావం సరిగ్గా లేక పైరు కోసం చేసిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు. రైతుల ఆత్మహత్యలు జిల్లాలో ఇన్ని జరుతున్న జిల్లా అధికారులు తీరు నిమ్మకునిరుఎత్తినట్లు ఉన్నది. జిల్లాలో ఎందరో రైతులు అన్నం పెట్టే పొలంలోనే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి జిల్లాకు చంద్రబాబు ఎన్ని సార్లు పర్యటన చేసిన వీటిపై ప్రకటనలు, చర్యలు ఇంతవరకు లేవు. తన భూమిని వేరొకరు కబ్జా చేసిన కేసులో తనకు న్యాయం చేయడానికి రెవెన్యూ అధికారులు తనను లంచం అడిగారని ఆగ్రహించిన ఓ రైతన్న పట్టణ వీధుల్లో తన కుటుంబంతో సహా బిచ్చమెత్తుతూ సరికొత్త పద్ధతిలో నిరసన తెలిపాడు. కర్నూల్ జిల్లా, వెలుగోడు మండలం, మాధవరం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు, తన భూమిని కొంతమంది ఆక్రమించారని అధికారులకు ఫిర్యాదు చేసాడు. కాని లంచం ఇవ్వనిదే పని అవదని అక్కడి అధికారులు అన్నారని అతను వాపోయాడు. రైతు సంఘాలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణీంచి, వెంకటేశ్వర్లుకు మద్దతు తెలిపాయి. వారందరూ అక్కడ ధర్నా చేసి, మొత్తం విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. అయితే కలెక్టర్, వెంకటేశ్వర్లు అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, ఇందుకు అతని మీద పరువు నష్టం దావా వేయబోతున్నామని చెప్పడం గమనార్హం.