ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు అవసరం… అత్తూరు హరిప్రసాద్ రెడ్డి…….


చిత్తూరు జిల్లా రేణిగుంట…
ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు అవసరం.పరిపాలన వికేంద్రీకరణ తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం.. అత్తూరు హరిప్రసాద్ రెడ్డి……. ఎంతమంది, ఎన్ని పార్టీలు అవరోధాలు సృష్టించి నా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా, ప్రజలు ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడిగా, యువ దార్శనికుడిగా, అనతికాలంలోనే పరిపాలనాదక్షుడిగా ప్రజలందరి మన్ననలను పొందుతూ ముందుకు సాగుతున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసనరాజధానిగా అమరావతి ని, పరిపాలనా రాజధానిగా, విశాఖపట్నం ను, ఎన్నో దశాబ్దాలుగా పోరాడుతున్న రాయలసీమవాసుల చిరకాల స్వప్నంగా కర్నూలును న్యాయరాజధానిగా అధికారికంగా ప్రకటించిన సందర్భంగా తమ సంతోషాన్ని, కృతజ్ఞతలను తెలియజేస్తూ ఈ రోజు 2.8.2020 వ తేదీన రేణిగుంట మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేణిగుంట పట్టణం నడిబొడ్డున ఉన్న గంగమ్మ తల్లి శూలం వద్ద స్వర్గీయ శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డి, ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి మరియు శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే శ్రీ బియ్యపు మధుసూదన రెడ్డి గారి చిత్రం పటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ ధన్యవాద కార్యక్రమంలో రేణిగుంట మండల కన్వీనర్ శ్రీ అత్తూరు. హరిప్రసాద్ రెడ్డి గారు, మాజీ జడ్పీటీసీ శ్రీ భక్తిమాల తిరుమల రెడ్డి గారు, నాయకులు జువ్వల దయాకర రెడ్డి గారు, ఎంపీటీసీ. సుజాత, రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి మహబూబ్ భాషా, జిల్లా కార్యదర్శి మల్లిరెడ్డి, ముస్లిం మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు అబ్దుల్ ఖా ధీర్ , మండల జనరల్ సెక్రెటరీ. ఫరీద్ బాబా, మండల ఎస్సీ ఎస్టీ సెల్ కన్వీనర్ నగేష్, మండల మైనారిటీ కార్యదర్శి సయ్యద్ అలీ, పట్టణ కార్యదర్శి ప్రభాకర్ , రమేష్, షబ్బీర్, ఇరానీ, ఈశ్వరి బుజ్జమ్మ, సరోజమ్మ, ఖాదర్,మాజీ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, మండల, పట్టణ నాయకులు, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author