ఉయూరు లో దొంగల దొంగాట…
https://youtu.be/E7pHxznfoF0
ఉయూరు మండలం గండిగుంటలో రెండిల్లలో చోరీ
మరో ఇంటిలో యజమాని కేకలు వేయడంతో దొంగ పరారి
రెండిల్ల యజమానులు గత నెల రోజులుగా వూళ్లో లేకపోవటం గమనించి దొంగతనాలు
గండిగుంట లోని కొండారెడ్డి వీధిలో ఉన్న సాయి దత్త నివాస్ అపారట్మెంట్ లో నివాసం ఉండే చవాన్ . ఉమామహేశ్వర రావు కుటుంబం ఫస్ట్ ఫ్లోర్ లో FF 4 నంబర్ ప్లాట్ లో నివాసం వుంటుంది . నెల రోజుల క్రితం హైదరాబాద్ లోని కుమార్తె ఇంటికి వెళ్లి ఈ రోజు తెల్లవారు ఝామున 5 గంటల సమయంలో తమ ఇంటికి వచ్చారు. తాము వేసిన తాలాం కప్ప లేకుండా తలుపు దగ్గరకు వేసిఉంది కంగారుపడి తలుపులు తీసి చూడగా బెడ్ రూం లో బీరువా తీసి బట్టలు అన్ని చిందర వందరగా మంచం పై న, మరికొన్ని కిందా పడేసి వున్నాయి. బీరువాలు పెట్టిన పరుసులు సైతం తీసి మంచం మీద పడవేసి , బీరువాలో దాచిన 10 వేల నగదు, వెండి, బంగారు ఆభరణాలు, చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇదే ప్లాట్ లో FF 2 లో నివాసం ఉండే కేతినేని లీలా ప్రసాద్ ఉదయం నడకకు వెళ్లారు, తన ప్లాట్ కు తాళం వేసి వెళ్లారు. అయితే ఇంటిలో ఆయన భార్య ఉన్నారు. అయితే దొంగ ఈ ఇంటి తాళం పగలకొట్టి లోనికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. అలికిడి విన్న లీలా ప్రసాద్ బార్య తన భర్త వచ్చారేమో నని వచ్చేసరికి ఒక వ్యక్తి జర్కిన్ వేసుకొని ఉన్నట్లు గుర్తించి కేకలు వేయడంతో దొంగ పారిపోయాడు. ఇదే వీధి మొదటిలో నివాసం ఉండే పిన్నింటి గీత అనే మహిళ ఇంటిలో సైతం తాళాలు పగులకొట్టి చొరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి యజమాని గత రెండు నెలలుగా వూరు వెళ్లారు. బంధువులు, సమీప నివాశస్తుల సమక్షంలో క్లూస్ టీమ్ బృందం తనికీలు జరిపారు. ఈ ఇంటిలోను బీరువా తాళాలు పగులకొట్టి బట్టలు ఇతర సామగ్రి చిందర వందరగా మంచం పై పడవేసి వున్నాయి. యజమాని తో ఫోన్ లో మాట్లాడి పోయిన వస్తువుల వివరాలు సేకరిస్తున్నారు.
కేసు నమోదు చేసిన ఉయ్యూరు పట్టణ పోలీసులు
చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించిన కంకిపాడు సర్కిల్ సీసిఎస్ సీఐ వెంకట సుబ్బారావు
రంగంలోకి దిగిన క్లూస్ టీం