రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి కృష్ణ కరకట్ట ప్రజలను కాపాడండి…
*కృష్ణా కరకట్ట ప్రజల ఇళ్లను తొలగించొద్దు.*
*గత ప్రభుత్వ దారిలోనే నడుస్తున్న వైసీపీ ప్రభుత్వం.*
*ఎన్నికలకు ముందు పట్టాలు ఇస్తామని మాట ఇచ్చి నేడు మాటమార్చి వేల ఇళ్లు తొలగించడానికి పూనుకుంటున్న వైఎస్సార్ ప్రభుత్వం.*
*నేడు విజయవాడ కృష్ణలంక తారకరామా నగర్లో కృష్ణా కరకట్ట వాసులు ఇళ్లు తొలగించవద్దు , రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని ధర్నా
నిర్వహించారు.*
సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా లో పాల్గొన్న సిపిఎం నేత ch. బాబురావు, కాశీనాథ్
*బాబురావు కామెంట్స్*
⭐ కరోనా కష్టాల్లో, వరదల్లో కృష్ణ కరకట్ట వాసులు అష్ట కష్టాలు పడుతూ ఉంటే వారిని
ఆదుకోవడంలో వైఎస్సార్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది.
⭐ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేస్తున్నామని సంవత్సరం క్రితమే విజయోత్సవ ఊరేగింపులు కూడా మంత్రులు, ప్రజాప్రతినిధులు , నేతలు జరిపారు.
⭐ కానీ రక్షణగోడ మాట మరిచారు, కనీసం వరద బాధితులకు గత రెండు సంవత్సరాలుగా నయాపైసా ఆర్థిక సహాయం కూడా అందించలేదు.
⭐ ఇప్పుడు రక్షణ గోడ నిర్మాణం పేరుతో 2500 ఇళ్లను తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించడం శోచనీయం.
⭐ 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి గత 17 నెలలుగా వాయిదాలు వేస్తూ ఉన్న ఇళ్లు కూడా తొలగించడం అన్యాయం.
⭐ గతంలో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి కృష్ణ కరకట్ట వాసులను తొలగించ వద్దని ఆందోళనలు చేసింది,అధికారంలో రాగానే మాట మార్చ ఇళ్ళు తొలగించడం మోసపూరితం.
⭐ తక్షణమే ఇళ్లు తొలగించకుండా రక్షణ గోడ నిర్మించాలి, వరద సహాయం అందించాలి.
⭐ వరద బాధితులకు అందిస్తున్న నిత్యావసర సరుకులు కూడా అందరికీ అందడం లేదు, అందరికీ అందే ఏర్పాట్లు చేయాలి.
⭐ వైఎస్ఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు స్పందించాలి , ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే
ప్రజా ఉద్యమం తప్పదు.
⭐ నేడు జరిగిన ధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి. కాశీనాథ్, తూర్పు సిటీ కార్యదర్శి బి. నాగేశ్వరరావు , నగర నాయకులు ఎం.
హరినారాయణ, టి. శేఖర్ , కె.వెంకటేశ్వరరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.