మొళగాపొడి రెసిపి…… అంటే….”ఇడ్లీ కారం”


తమిళ భాషలో “మిళగై అంటే ఎండు మిరప కారలు “మిళగు” అంటే ‘మిరియాలు’ అని అర్థం (తమిళ భాష లోని నా పదాలకు సరి చేసిన సోదరీమణులు శ్యామల & నళిని స్వామి గార్లకు ధన్యవాదాలు)మిరియాల ఘాటు ప్రధానంగా, ఇతర దినుసులతో చేసే…ఈ పౌడర్ చట్నీ….దక్షిణాది న చాలా ప్రసిద్ధి. ఇడ్లీలు, దోశలు, ఉప్మా లతో ఈ పొడిని నంజుకుని తినడం అలవాటు. ఈ పొడినీ అలాగే….కాకుండా….”నువ్వులనూనె” గానీ, “నెయ్యి” గానీ జోడించి తింటే మరింత కమ్మగా ఉంటుంది. అయితే మన తెలుగు వారి విషయానికి వస్తే….అదనంగా ఉప్పూ, కారాలతో…మరింత కమ్మగా తయారు చేస్తుంటారు. ఇప్పుడంటే కొలతలంటున్నాం మన అమ్మమ్మల కాలంలో…అన్ని దినసులు అందాజుగా తీసుకుని కలిపి అద్భుతాలు చేసేవారు.
సరే రండి….మొళగాపొడి చేద్దాం!

అడుగున మందంగా ఉన్న బాణలి స్టౌ మీద పెట్టండి. ఓ అరగ్లాసు(సుమారు 50/60 గ్రామ్స్)’తెల్లనువ్వులు’
అందులో వేయండి…స్టౌ ఆన్ చేయండి…అట్లకాడతో
దోరగా వేయించండి…..(No oil please) కమ్మని వాసనరాగానే స్టౌ ఆపేసి…..ఓ ప్లేట్/ గిన్నె లోనికో నువ్వులు మార్చండి.

మళ్ళీ… ఆ కడాయి/ బాణలి లో కి…
ఓ గ్లాసు మినప్పప్పు (సుమారు 100 గ్రా)
అందులో సగం శనగపప్పు,
ఓ టేబుల్ స్పూన్ – “మిరియాలు” ( 20/25 గ్రా)
అందులో సగం జీలకర్ర
ఎండు మిర్చీ — 6/8
ఇంగువ ముక్క….తగినంత
పావు చెంచా — చొప్పున……ఆవాలు & మెంతులు
గుప్పెడు కరేపాకు
వేసి
ఓ టీ స్పూన్ నూనె వేసి…. స్టౌ ఆన్ చేసి…
అట్లకాడ తో …..దోరగా/ కమ్మగా వేయించండి.
స్టౌ ఆపండి……..బాగా చల్లారనివ్వండి…
చిటికెడు పసుపూ/ రుచికి తగ్గ ఉప్పూ కలిపి…
95% వరకూ మిక్సీ జార్ లో “పౌడరు” చేయండి.
(అంటే….మరి మెత్తని పిండిగా కాకుండా కొద్దిగ బరకగా ఉండాలి)

సర్లేండి!! చెప్పడానికింకేం లేదుగానీ….. ఈ మొళగాపొడి దోశల తోనూ, ఉప్మా తోనూ టేస్ట్ చేయవచ్చు!!!

About The Author