అంతర్జాతీయ పతంగుల పండుగ 13, 14 జనవరి
తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో జనవరి 13 నుండి 15 వరకు సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో అంతర్జాతీయ పతంగుల పండుగ కు అనుబందంగా ఇంటర్ నేషనల్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహణ ఏర్పాట్లు పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అధ్యక్షతన బేగంపేట లోని పర్యాటక భవన్ లో జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో పర్యాటక అభివృద్ది సంస్థ ఛైర్మన్ భూపతి రెడ్డి , మెనేజింగ్ డైరెక్టర్ మనోహర్, తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, నిథమ్ డైరెక్టర్ డా. చిన్నమ్ రెడ్డి, తెలంగాణ టూరిజం శాఖ అధికారులు మహేష్, శశిధర్ లతో పాటు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తూన్న వివిధ రాష్ట్రాల అసోషియేషన్ ప్రతినిధులు పాల్గోన్నారు.ఈ సమావేశంలో స్వీట్ ఫెస్టివల్ నిర్వహణ పై చర్చించారు. గత సంవత్సరం జరిగిన స్వీట్ ఫెస్టివల్ కు విశేష స్ఫందన లభించిందన్నారు బుర్రా వెంకటేశం. వెయ్యి రకాల మిఠాయిలను రుచి చూడటానికి నగర ప్రజలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 8 లక్షల మంది సందర్శకులు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ కు తరలివచ్చారన్నారు. ఈ సంవత్సరం ఇంటర్ నేషనల్ స్వీట్ ఫెస్టివల్ లో పాల్గోనడానికి సుమారు 20 దేశాల పైగా ప్రతినిధులు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేసుకోవటానికి ఆసక్తి గా ఉన్నారన్నారు. వీరితో పాటు దేశంలో వివిధ ప్రాంతాల వారు తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తూన్న ప్రజలు, వివిధ ప్రాంతాల భాష, సంస్కృతి సంఘాల ప్రతినిధులు సుమారు 10 లక్షల మందికి పైగా సందర్శకులు సందర్శించే అవకాశం ఉందని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. జనవరి 13 నుండి 15 వరకు మూడు రోజుల పాటు జరుగుతున్న మిఠాయిలు , పతంగుల పండుగకు వివిధ దేశాల, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు స్వచ్చందంగా తరలివస్తున్నారన్నారు బుర్రా వెంకటేశం. స్వీట్ ఫెస్టివల్ కు తరలి వస్తున్నా సందర్శకులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.