భార్య పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబాన్ని పరామర్శించిన్న ఆంద్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి వర్యులు S B అంజద్ బాషా …
నంద్యాల నవంబర్ 9:- భార్య పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబాన్ని ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి వర్యులు SB అంజాద్ బాషా పరామర్శించారు.
సోమవారం ములసాగరం లో భార్య పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబాన్ని ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి వర్యులు SB అంజద్ బాషా, నంద్యాల పార్లమెంట్ సభ్యుడు పోచ బ్రహ్మానంద రెడ్డి, నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, కర్నూల్ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి లతో కలసి పరామర్శించారు.
అనంతరం ఉపముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ గౌ,, ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రోజు ఈ కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగినదని బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ లను కూడా నియమించారని ఆయన అన్నారు ఈ కేసు దర్యాప్తు అనంతరం దోషులు ఎంతటి వారినైనాసరే వారికి శిక్ష పడేలా చేయాలనేది మన ముఖ్యమంత్రి గారి వుదేశం అన్నారు మన ముఖ్యమంత్రి కుల మత లకు అతీతంగా న్యాయం చేసే వ్యక్తి అని ఆయన అన్నారుఇకపై ఎలాంటి సంఘటన లు పునరావృతం కాకుండా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉందని ఆయన అన్నారు.