48 రోజుల తర్వాత మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు లకు రెక్కలొచ్చాయి
హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. గత 48 రోజులపాటు నిలకడగా ఉన్న ఇందన ధరలకు ఇప్పుడు రెక్కలొచ్చాయి. ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు లేటెస్ట్గా రేట్లను పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 17 పైసలు పెరిగి 81.23ను చేరింది. డీజిల్ ధరలు సైతం లీటర్కు 22 పైసలు పెరిగి 70.68ను తాకింది. ముంబైలో పెట్రోల్ లీటర్ రూ. 87.92ను తాకింది.. డీజిల్ రూ. 77.11కు చేరింది చెన్నైలో పెట్రోల్ ధర రూ. 84.31చేరగా.. డీజిల్ రూ. 76.17గా ఉంది. కోల్కతాలో పెట్రోల్ ధర రూ. 82.79ను తాకింది.. డీజిల్ రూ. 74.24గా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 22 పైసలు పెరిగి రూ.
85.47కు చేరింది. డీజిల్ ధరలు మరింత అధికంగా 28 పైసలు బలపడి రూ. 77.12ను తాకినట్లు తెలుస్తోంది.