చదివింది ఎంబీఏ… చేసింది నీచపు వ్యాపారం…


గుంటూరు:భార్యకు తెలియకుండా ఆమె నగ్న వీడియోలు చిత్రీకరించి వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా విక్రయించిన భర్తను, వాటిని చూసిన యువకుడిని దిశ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు పోలీసు కార్యాలయంలో సోమవారం కేసు వివరాలను అర్బన్‌ ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి విలేకరులకు తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వ్యక్తి ఎంబీఏ చదివాడు. వాయుసేనలో ఉద్యోగం చేస్తున్నానంటూ నమ్మించి గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన యువతిని భారీగా కట్నం తీసుకుని 2017లో వివాహం చేసుకున్నాడు. అదనపు కట్నం కోసం ఆమెను అత్త, మామ వేధింపులకు గురి చేసేవారు. కొంతకాలానికి అతను వాయుసేనలో ఉద్యోగం చేయడం లేదని తెలిసింది. అనంతరం గుంటూరు ఎ.టి.అగ్రహారంలో కాపురం పెట్టాడు. బ్రాడీపేటలో కొరియర్‌ సర్వీసు పెట్టి నష్టపోయాడు. చెడు వ్యసనాలకు బానిసై సులువుగా డబ్బులు సంపాదించాలని నీచపు ఆలోచన చేశాడు. భార్య నగ్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లోని ట్యాగ్‌డ్‌ యాప్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా డబ్బులు చెల్లించిన వారికి వీడియో కాల్‌లో చూసేలా చేశాడు. అలా చేయమంటూ ఆమెను వేధించడంతో బాధితురాలు దిశ పోలీసుస్టేషన్‌లో డీఎస్పీ సుప్రజకు ఫిర్యాదు చేశారు. ఆమె లోతుగా దర్యాప్తు చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. భార్యకు తెలియకుండా ఆమె నగ్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లోని యాప్‌లతో పాటు డార్లింగ్‌ యూజర్‌ ఐడీ ద్వారా డబ్బులు చెల్లించిన వారికి పోస్టు చేసేవాడు. గుంటూరు గాంధీనగర్‌కు చెందిన బచ్చు శివకుమార్‌ రూ.300 ఫోన్‌పే ద్వారా చెల్లించి వాటిని చూడడంతో పాటు డౌన్‌లోడ్‌ చేసున్నాడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన సంతోష్‌ ప్రధాన నిందితుడికి స్నేహితుడు. తన భార్యతో శారీరకంగా సంబంధం పెట్టుకోవాలని ప్రోత్సహించి ఆమె ఫోన్‌ నెంబర్‌ ఇచ్చాడు. అతను బాధితురాలికి ఫోన్‌ చేసి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. భార్యను అడ్డుపెట్టుకొని నీచంగా డబ్బులు సంపాదించడమే మార్గంగా పెట్టుకున్న వ్యక్తితో పాటు డబ్బులు చెల్లించి నగ్న వీడియోలు చూసిన శివకుమార్‌ను అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. టెక్కలికి చెందిన సంతోష్‌, బాధితురాలి అత్త, మామలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. నిందితులను చాకచక్యంగా అరెస్టు చేసిన దిశ డీఎస్పీ సుప్రజ, ఎస్సైలు అనురాధ, ఖాజీబాబు, ఏఎస్సై ఉషారాణి, హెచ్‌సీలు బాపనయ్య, కె.ఎస్‌.ప్రసాద్‌, వెంకటప్రసాద్‌, సైబర్‌ నిపుణుడు వి.కిరణ్‌లకు రివార్డులు అందజేసి

About The Author