అతిమూత్రవ్యాధి నివారణా యోగాలు –
* తంగేడు చెట్టు సమూలం తెచ్చి ఎండించి చూర్ణం చేసి దానికి సమముగా పంచదార కలిపి పూటకు రెండున్నర గ్రాముల చొప్పున సేవించుచున్న అతిమూత్ర వ్యాధి నివారణ అగును.
* వెల్లుల్లి రేఖలు రెండుపూటలా తినవలెను . మొదటిరోజున ఒక రేఖ , రెండొవరోజున రెండు రేఖలు ఈ విధముగా పదిరోజులు క్రమం తప్పకుండా పెంచుకుంటూ పోతూ తినవలెను .
* నేరేడు గింజలను నీడలో ఎండించి మెత్తటి చూర్ణం చేసి నిత్యం అయిదు గ్రాముల చొప్పున నీటితో కలిపి సేవించుచున్న అతిమూత్ర వ్యాధి హరించును .
* మర్రిచెక్క రసము కాని కషాయం కాని సేవించుచున్న అతిమూత్ర వ్యాధి తగ్గును.
* మేడిచెక్క కషాయం కాని రసము కాని సేవించిన అతిమూత్ర వ్యాధి తగ్గును.
* తంగేడు పువ్వులను నీడలో ఎండించి చూర్ణం చేసి ఉదయం , సాయంత్రం 5 గ్రాముల చూర్ణాన్ని నీటితో కలిపి తాగవలెను.
* మర్రిపండ్లలోని గింజలను తీసుకుని నీడన ఎండించి మెత్తటి చూర్ణం చేసుకుని ఆ చూర్ణమును ఉదయం , సాయంత్రం 10 గ్రాముల చూర్ణమును నీటిలో కలిపి తీసుకొనుచున్న 40 రోజులలో అతిమూత్ర వ్యాధి హరించును .
* రావిచెట్టు పైన బెరడు నీడన ఎండించి చూర్ణం చేసుకుని రెండున్నర గ్రాముల చూర్ణమునకు తేనె , పంచదార కలిపి ముద్దలా చేసి ఉదయం , సాయంత్రం ఆహారానికి గంటన్నర ముందు తీసికొనవలెను.
* అత్తిపత్తి ఆకు అనగా ముట్టుకుంటే ముడుచుకుపోయే ఆకు ఈ ఆకు పది గ్రాములు , పాతబెల్లం కలిపి నూరి కుంకుడు గింజ అంత మాత్రలు చేసుకొని ఉదయం , మధ్యాన్నం , సాయంత్రం మూడుపూటలా తీసికొనవలెను.
పైనచెప్పిన యోగాలలో మీకు అనువైన యోగాన్ని ఏదో ఒకటి తీసుకుని ప్రయత్నించండి.
కాళహస్తి వేంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేద వైద్యులు