డిసెంబర్ 31 వ తేది రాత్రి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తాం
తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్…
నూతన సంవత్సర వేడుకలపై గట్టి పోలీసు నిఘా.
నూతన సంవత్సర వేడుకల పేరుతో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాం, కేసులు నమోదు చేస్తాం.
ప్రజల భద్రతకు భంగం కలిగేలా ఏవరైనా ప్రవర్తిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు.పోలీసుల నిబంధనలు పాటించాలన్నారు.వ్యాపారస్తులు, బట్టల షపులు మొదలుగునవి అన్నియు యధాప్రకారం వారికి నిర్దేశించిన సమయం లోపలే మూసివేయాలి.డిసెంబర్ 31 వ తేది రాత్రి యువత అత్యుత్సాహంతో ర్యాష్ డ్రైవింగ్, స్నేక్ డ్రైవింగ్, సైలెన్సుర్లు తీసివేసి పెద్ద శబ్దాలతో అల్లర్లు చేస్తూ బైక్ రేసులు, స్టంట్లు చేస్తూ రోడ్డు ప్రమాదాలకు గురిచేయడం వంటివి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.డిసెంబర్ 31 వ తేది రాత్రి 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుంది.తిరుపతిలో పలు చోట్ల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయి.
కోవిడ్ -19 ప్రోటోకాల్ ను పాటించాలి.
ఎక్కువ సంఖ్యలో గుంపులు, గుంపులుగా గూమి కూడరాదు.బార్లు, వైన్ షాపులు, రెస్టారెంట్లు, షాపులు ప్రభుత్వం నిర్ధేశించిన సమయం వరకే ఉండాలలి.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలతో గట్టి పోలీసు నిఘా ఏర్పాటు చేశాము. అత్యవసర వేళ్ళలో డయల్ – 100, పోలీసు వాట్స్అప్ 80999 99977 నెంబర్లకు సంప్రదించాలని తిరుపతి అర్భన్ జిల్లా యస్.పి ఒక ప్రకటనలో తెలిపారు.