నకిలీ IPS అధికారి అరెస్టు 12 లక్షల నగదు స్వాధీనం

తిరుపతి:తాను IPS అధికారినని, హైదరాబాదు కు పోలీసు కమీషనర్ గా పని చేస్తున్నానని చెబుతూ తనకు ప్రభుత్వంలో, రాజకీయ నాయకులతో బాగా పరిచయాలున్నాయని, తాను ఎవరికైనా ఇసుక క్వారీలు, పిల్లలకు TTD లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నమ్మిస్తూ 39 లక్షలు వసూలు చేసిన హైదరాబాదు కు చెందిన Mohammad Musthak @ DilhiMusthakఅను వ్యక్తి ని ఈ దినం తిరుపతి CCS పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి 12 లక్షల నగదును,స్వాధీనం చేసుకున్నారు

హైదరాబాదుకు చెందిన మహమ్మద్ ముస్తాక్ అనునతను రియల్ ఎస్టేట్ పనులు చేసుకుంటూ వుండేవాడు. అతను 2013 లో శ్రీకాలహస్తికి చెందిన వహీదా అను ఆమెను రెండవ పెళ్లి చేసుకుని ఆమె కోసం హైదరాబాదు నుంచి శ్రీకాలహస్తి కి పోతూ వస్తూ తిరుపతి రైల్వే స్టేషన్ లో విజయ డైరీ మిల్క్ షాపును నడిపే శివలీలా దేవితో పరిచయం పెంచుకుని ఆమెకు తాను IPS అధికారినని, హైదరాబాదు కు పోలీసు కమీషనర్ గా పని చేస్తున్నానని చెబుతూఆమె ద్వారా డ్వాక్రా సబ్యులయిన మునీరాజమ్మ, భాను , యశోద , జయలక్ష్మీ, హేమలత, నాగరాజు, మధు  లతో పరిచయం పెంచుకుని తనకు ప్రభుత్వంలో, రాజకీయ నాయకులతోబాగా,పరిచయాలున్నాయని వారి పిల్లలకు TTD ఉద్యోగాలు ఇప్పిస్తామని , డ్వాక్రా మహిళలకు ఇసుక క్వారీలు ఏర్పాటు చేయిస్తానని నమ్మించి వారినుంచి 39 లక్షలు వసూలు చేసుకుని తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరార్ అయినాడు.దానిపై హేమలత ఇచ్చిన ఫిర్యాదు పై జిల్లా ఎస్‌పి శ్రీ ఆవుల రమేశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన తిరుపతి CCS పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని Crime I/C అడిషనల్ ఎస్‌పి మునిరామయ్య, డి.యస్.పి మురళీధర్ గార్లసూచనలు పాటిస్తూ దర్యాప్తును ముమ్మరం చేసి ఈ దినం ముద్దాయి మహమ్మద్ ముస్తాక్ @ డిల్లీ ముస్తాక్ ను తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద అరెస్టుచేసి అతని నుంచి 12 లక్షల నగదును స్వాధీనం చేసుకుని ముద్దాయిని రిమాండుకు పంపుతున్నారు. కేసు దర్యాప్తు చేయడంలో, ముద్దాయిని అరెస్టు చేయడంలో విశేష ప్రతిభ కనపరచిన CCS, CI మోహన్ ను వారి సిబ్బందిని జిల్లా ఎస్‌పి గారు అబినందిస్తూ వారికి రివార్డులు మంజూరు చేయనున్నట్లు తెలిపినారు.వివిధ కేసులలో చోరీ కాబడిన 845 gms బంగారు, 400 gms సిల్వర్ ,12 లక్షలు నగదు , 9 ద్విచక్ర వాహనాలు ఒక్క weighing మెషిన్ మొత్తం ఒక్క కోటి రూపాయలు సొత్తు రికవరీ . 7 మంది అంతర్ రాస్ట్ర నేరస్తులు అరెస్ట్.

తిరుపతి అర్బన్ జిల్లా లో పెండింగు లో ఉన్న చోరీ కేసులపై దృష్టి సారించిన తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ. ఏ.రమేష్ రెడ్డి ఐ.పి.యస్ గారు ముఖ్యంగా పాత నేరస్తులపై, జైలు నుంచి రిలీజైన నేరస్తులపై  ప్రత్యేక నిఘా యేర్పాటు చేసి వారిని తనికీ చేయమని ఆదేశాలివ్వడంతో తిరుపతి Crime పోలీసులు CI ల ఆద్వర్యం లో ప్రత్యేక టీములు గా యేర్పడి CrimeI/Cఅడిషనల్,ఎస్‌పి,మునిరామయ్య,CCS,డి.యస్.పి మురళీధర్ గార్ల సూచనలు పాటిస్తూ పాత నేరస్తుల పై , జైలు నుంచి రిలీజైన నేరస్తులపై  ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసినారు. అందులో భాగంగా, నిన్నటి దినం సాయంత్రం సూళ్ళూరు పేట కు చెందినకటారి రాకేష్ అను మోటార్ సైకిల్ నేరస్థుదిని అరెస్టు చేసి అతని నుంచి 9 మోటార్ సైకిళ్ళు తిరుపతి సి.సి.యస్ పోలీస్ స్టేషన్ కు సంబంధించి 2కేసులు, ఈస్టు పోలీసుస్టేషన్ కు సంబంధించిన 6 కేసులు, అలిపిరి పి‌ఎస్ కు సంబంధించిన 1 కేసుకు సంబంధించిన వాటిని స్వాధీనం చేసుకున్నారు. సదరు నేరస్థుడు సూళ్ళూరుపేట లో ఇంటివద్దనే మోటార్ సైకిల్ మెకానిక్ పనులు చేస్తుండి గత 1 సంవత్సర కాలంగా తిరుపతి కి వచ్చి పోతూ మొత్తం 9 మోటార్ సైకిల్ లను దొంగతనం చేసినాడు. అదేవిధంగా నిన్నటి దినం పాత నేరస్థులైన 1) దాము @ATM,2) సయ్యద్ అబ్దుల్కరీం అను వారిని అరెస్టు చేసి వారి నుంచి పైగా విలువ చేయు 173 గ్రముల బంగారు నగలను, 400 గ్రముల వెండి వస్తువులను  స్వాధీనం చేసుకున్నారు. సదరు నేరస్తులు 2019 మే నెల లో తిరుపతి రాఘవేంద్రనగర్ దగ్గర శ్రీనగర్ కాలనీ లో ఒక ఇంటి లోనూ, అదే సంవత్సరం డిశంబరు నెలలో శ్రీ కాళహస్తి బంగారమ్మ కాలనీ లో ఒక ఇంటిలోనూ , ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో తిరుపతి పద్మావతి పురం లో ఒక ఇంటిలోనూ దొంగతనాలు చేసినారు. వీరిలో దాము @ATM పై తిరుపతి సి.సి.యస్, ఈస్టు, అలిపిరి, తిరుచానూరు,MR పల్లె పోలీసు స్టేషన్ల లోనూ, తడ పోలీసు స్టేషన్ లోనూ సుమారు 30 కి పైగా కేసులు వున్నాయి. సయ్యద్ అబ్దుల్ కరీం పై గూడ తిరుపతి, చెన్నై లలో 17 కి పైగా కేసులు వున్నాయి. అదేవిధంగా నిన్నటిదినం పాత నేరస్థుడైన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సురేశ్ గౌడ అను నేరస్థుడిని అరెస్టు చేసి అతని నుంచి 293 గ్రముల బంగారు నగలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేరస్థుడు 2017 వ సంవత్సరం మే నెలలో ఒకే రోజు రాతిరి తిరుపతి శివజ్యోతినగర్ లో ఒక ఇంటిలోనూ, సాయినగర్ లో ఒక ఇంటిలోనూ దొంగతనాలు చేసినాడు. అదేవిధంగా ఈ నేరస్థుడు అదే సంవత్సరం నవంబరు నెలలో తిరుపతి MR పల్లె శాంతినగర్ లో ఒక ఇంటిలో 30 వేల రూపాయలను కూడా దొంగలించినాడు. ఈ నేరస్థుది పై గతంలో గుంతకల్, ఆదోని, హైదరాబాదు, బళ్ళారి లలో సుమారు 30 కి పైగా కేసులు వున్నాయి.అదేవిధంగా ఈ దినం ఉదయం పాత నేరస్తులైన తిరుపతి కి చెందిన పాత నేరస్తులు 1)జ్యోతి కుమార్,2)పవన్ కుమార్ అను వారులను అరెస్టు చేసి వారినుంచి 400 గ్రములకు పైగా బంగారు నగలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేరస్తులు 2016 సెప్టెంబరు నెల లో తిరుపతి NGOs కాలనీ లో ఒక ఇంటిలోనూ, అదే సంవత్సరం నవంబరు నెలలో లింగేశ్వరనగర్ లో ఒక ఇంటిలోనూ దొంగతనాలు చేసినారు అదేవిధంగా 3 రోజుల ముందుగా వీళ్ళిద్దరూ తిరుచానూర్ తారకరామ కాలనీలో ప్రశాంత్ అనునతని ఇంటిలో బంగారునగలు, వెండి వస్తువులు, నగదు దొంగతనం చేసినారు. అదేవిధంగా తిరుపతి వేదాంతపురం లోని కెనరా బ్యాంకుషట్టరు బీగాలు పగలగొట్టి , కిటికీ కమ్మలు విరగగొట్టి ఆ బ్యాంకులో కంప్యూటర్ ను డ్యామేజి చేసి ఒక ఎలక్టోనిక్ వేయింగ్ మిషన్ ను దొంగలించినారు.  ఈ నేరస్తులు పోయిన సంవత్సరం తిరుపతి MR పల్లె పోలీసు స్టేషన్ లో ఒక దొంగతనం కేసు , ఒక హత్యాయత్నం కేసులలో వీరు నిందితులు. పై నేరస్తులను అరెస్టు చేయడంలోను, చోరీ సొత్తులు రికవరీ చేయడంలో ప్రతిభ చూపిన తిరుపతి CCS, CIలు చల్లని దొర, మధు బాబు, రసూల్ సాహెబ్, వేణుగోపాల్ లను, ఎస్‌ఐ లను, సిబ్బంది అయిన ASI రాజేంద్ర, ఆనంద్, HCs పరమేశ్వరరెడ్డి ,గోపి కృష్ణ , రవిప్రకాష్ , మురళి, సురేష్ , వినాయక, శ్రీనివాస్, రాజశేఖర్, PC ప్రసాద్ , బారుషా, స్వయం ప్రకాష్, మోహన్, Lగోపీనాధ్ , రామకృష్ణ ,Trinadh లను జిల్లా ఎస్‌పి గారు అబినందిస్తూ వారికి రివార్డులు మంజూరు చేయనున్నట్లు తెలిపినారు.

About The Author