ఇక అగ్రకులంలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్…
బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికలకు ముందు మోడీ ఆర్థికంగా వెనుకబడిన అగ్ర కులాల వారికి విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏడాదికి రూ.8 లక్షలకు తక్కువ ఆదాయం ఉన్న అగ్ర కులాల వాళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. దీంతో ప్రస్తుతం 50 శాతం ఉన్న రిజర్వేషన్లు 60 శాతానికి చేరనున్నాయి. ఈ మేరకు కేంద్రం రాజ్యాంగ సవరణ చేయనుంది. రేపే దీనికి సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ఆమోదం కోసమే పార్లమెంట్ శీతాకాల సమావేశాలను మరో రెండు రోజుల పాటు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.