ఈ గిరిజన తెగ రామ భక్తి ముందు హనుమంతుడు కూడా చాలడు..
రాముడికి కష్టమొస్తే ఉడుత కూడా బుడత సాయం చేసిందని విన్నాం….రాముడు తన వద్దకు వస్తాడని శబరి నిరీక్షించిన కథ కూడా చదివాము…ఐతే రాముడి నుంచి తమను ఏ శక్తి కూడా వేరు చేయలేదని నిరూపిస్తూ వళ్లంతా రామ నామంతో పచ్చ బొట్లు పొడిపించుకొంటోంది ఓ గిరిజన తెగ. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ రాముడి మీద తమకున్న అపార భక్తి విశ్వాసాలను ప్రదర్శిస్తోంది . ఈ గిరిజనుల రామభక్తి ముందు హనుమంతుడు కూడా చాలడేమో అనిపిస్తుంది వారిని చూస్తే.
కింద ఫొటోలలో కనిపిస్తున్న గిరిజన తెగ పేరు రామ-నామి తెగ . ఛత్తీస్ ఘడ్ అడవుల్లో నివసించే ఈ ప్రజలు తమ శరీరంలోని ప్రతి భాగంలోనూ రాముడి పేరును పచ్చబొట్టుగా వేయించుకుంటారు .
ఈ సమాజాన్ని ఏ యుగంలోనో శ్రీ రాముని ఆలయానికి వెళ్ళడానికి అనుమతించలేదు. అప్పుడు ఈ తెగ పూర్వీకులు రాముడిని మా నుండి లాక్కోలేరని చెప్పి ఇలా ఒళ్ళంతా రామ నామాన్ని పొడిపించుకుంటారు. కనురెప్పలను సైతం రామనామంతో నింపేసుకున్నారు.ఇప్పటికీ ఈ తెగ ప్రశాంతంగా జీవిస్తున్నారు. కేవలం రామనామాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకోవడమే కాదు. వారి జీవన విధానంలోని ప్రతీ పనిని, ప్రతీ శుభకార్యాన్ని రామ నామంతోనే ముడి పెడతారు. ఈ విధంగా, రాముడి పేరును పొందే సంప్రదాయాన్ని ఈ తెగలో ఆమోదించుకొన్నారు .
ఈ ప్రజలు బలమైన రామపంతిలు. ఇప్పుడు ఈ తెగ ప్రజలు కూడా ఆలయానికి వెళతారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కాని రామ్ పేరు రాసే సంప్రదాయం ఈ రోజు వరకు మారలేదు.