వయసు 11 ఏళ్ళు.. సంపాదించేది నెలకు రూ.6లక్షలు!


మహారాష్ట్రలోని నిగోస్ గ్రామానికి చెందిన శ్రద్ధాధావన్ అనే 11 ఏళ్ల అమ్మాయి నెలకు రూ.6లక్షలు సంపాదిస్తోంది.
మహారాష్ట్రలోని నిగోస్ గ్రామానికి చెందిన శ్రద్ధాధావన్ అనే 11 ఏళ్ల అమ్మాయి నెలకు రూ.6లక్షలు సంపాదిస్తోంది. అనారోగ్యంతో తండ్రి సత్యధావన్ పాల వ్యాపారం దెబ్బతినడంతో తండ్రి సూచనతో రంగంలోకి దిగింది శ్రద్ధాధావన్.. ఓ పక్క చదువుతూనే, మరోపక్కా ఇంటి పరిస్థితిని అర్థం చేసుకుని పశువుల పాకలోకి అడుగుపెట్టింది. పశువుల పాక శుభ్రం చేయడం, పాలు తీయడం వంటి పనులను శ్రద్ధగా చేసేది. వ్యాపారం గురించి ముందుగా ఏమీ తెలియని ఆమె ఆ తర్వాత అన్ని విషయాలను తెలుసుకుంది.. ఇంటింటికి తిరిగి పాలు పోస్తూ, వ్యాపారాన్ని విస్తరించి ఇప్పుడు నెలకు రూ.6లక్షలు సంపాదిస్తోంది. బాధ్యతలు పెరిగే సరికి సైకిల్ వదిలి బైక్ నడపటం నేర్చుకుంది శ్రద్ధాధావన్. గ్రామంలో బైక్‌పై తిరుగుతూ పాలను విక్రయించే మొట్టమొదటి ఆడపిల్ల శ్రద్ధాధావన్ కావడం విశేషం!

About The Author