లైవ్‌లో హీరోయిన్ క‌న్నీరుమున్నీరు


త‌న‌పై దుష్ప్ర‌చారం గురించి మాట్లాడుతూ ఆ హీరోయిన్ తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. త‌న హృద‌యాంత‌రాల్లోంచి క‌న్నీళ్లు త‌న్నుకొచ్చాయి. ఈ విష‌య‌మై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
‘మీ కుటుంబస‌భ్యుల‌పై ఎవ‌రైనా ఇలాంటి కామెంట్స్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నాపై జ‌రిగిన దుష్ప్ర‌చారం గురించి పెద్దగా ఆలోచించ‌క‌పోయినా ఆ బాధ న‌న్ను వెంటాడుతూనే ఉంది (క‌న్నీళ్లు). కాలం ప్ర‌తి గాయాన్ని న‌యం చేస్తుంది. మ‌రి కొన్నాళ్లకు అన్ని విష‌యాల గురించి మాట్లాడుతా. ప్ర‌స్తుతం నేను క్లిష్ట ద‌శ‌లో ఉన్నా. ఇకపై మిమ్మల్ని నవ్విస్తాను. వంట, ఫన్నీ వీడియోలతో మీ ముందుంటా’ అని రాగిణి చెప్పుకొచ్చారు.
క‌న్న‌డ హీరోయిన్ రాగిణి ద్వివేది డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయి 145 రోజుల పాటు జైల్లో ఉండాల్సి వ‌చ్చింది. ఇటీవ‌లే ఆమె బెయిల్‌పై బ‌య‌టికి వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె లైవ్‌లోకి వ‌చ్చారు. త‌న జీవితంలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లు త‌న‌నెంతో బాధ పెట్టాయ‌ని చెప్పుకొచ్చారు. త‌న‌పై జ‌రిగిన దుష్ప్ర‌చారాన్ని త‌ల‌చుకుంటూ , ఏడుస్తూ కూచోకుండా అభిమానుల్ని అల‌రిస్తాన‌ని ప్ర‌క‌టించారు.
ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో క‌న్నీటిప‌ర్యంత‌మ‌వుతూ అభిమానుల‌తో త‌న ఆవేద‌న పంచుకున్నారు. క‌ష్ట‌కాలంలో తనకు, తన కుటుంబానికి అండ‌గా నిలిచిన వారంద‌రికీ కృత‌జ్ఞ‌తలు చెప్పారు. దాదాపు 20 నిమిషాలు మాట్లాడిన ఆమె … త‌న‌పై, త‌న కుటుంబంపై వచ్చిన ప్రచారం, వివాదాస్పద వ్యాఖ్య‌లపై మండిప‌డ్డారు.
రాగిణి లైవ్‌లో ఏడ్వ‌డానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. రాగిణి లైవ్ ఎపిసోడ్‌పై ర‌క‌ర‌కాల కామెంట్స్ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ ఇవ‌న్నీ మ‌రిచిపోయి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాన‌ని ఆమె ప్ర‌క‌టించ‌డం ఆహ్వానించాల్సిందేన‌ని మెజార్టీ నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

About The Author