ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.


హైదరాబాద్‌ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
శనివారం లోక్‌సభలో మాట్లాడిన ఒవైసీ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ను తన గుప్పిట్లోకి తీసుకునేందుకు కేంద్రపాలిత ప్రాంతంగా మార్చుతారని అన్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం భవిష్యత్‌లో ఇదే నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.
అంతేకాకుండా చెన్నై, బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్, లక్నో నగరాలను.. యూటీలుగా మార్చే ప్రమాదం ఉందని ఆరోపించారు.
ఇదే బీజేపీ మార్క్‌ పాలన అని, కశ్మీర్‌ విభజనే దీనికి ఉదాహరణ అని ఒవైసీ పేర్కొన్నారు.
బీజేపీకి మద్దతిచ్చే పార్టీలు భవిష్యత్ పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
కాగా లోక్‌సభ మొదటి విడత బడ్జెట్‌ సమావేశాలు శనివారం ముగిసిన విషయం తెలిసిందే. రెండో విడత సమావేశాలు తిరిగి మార్చి 8న ప్రారంభమై ఏప్రిల్‌ 8వ తేదీ వరకు జరగనున్నాయి.

About The Author