వామనరావు దంపతుల హత్య పై మోనం న్యాయవాదుల దురదృష్టం.


న్యాయవాదులకు, జర్నలిస్టులకు ప్రత్యేక భద్రతా చట్టాలు కల్పించాలి.
వామనరావు దంపతుల హత్య పై కేసీఆర్ సర్కార్ స్పందించాలి.
కేంద్ర హోమ్ శాఖ ద్వారా ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలి.

న్యాయవాదులకు, పాత్రికేయులకు భద్రత లేని సమాజం రాక్షసరాజ్యం గా మారుతుందని ఏపి హై కోర్టు సీనియర్ న్యాయవాదులు, ఆంధ్రా లాయర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎస్ ఆర్ సంకు, అధ్యక్షులు ఎంవి రాజారామ్, ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ నేడొక సంయుక్త ప్రకటన ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

వృత్తి రిత్యా న్యాయవాదులైన గట్టు వామనరావు, నాగమణి ల పై కోర్టు పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో వుండగా అత్యంత పాశవికంగా దుండుగులు దాడిచేసి హతమార్చిన ఘటన బాదాకరణని, కొన ఊపిరి లో వున్న న్యాయవాదులను రక్షించే ప్రయత్నం కూడా అక్కడ వున్న వారు చేయలేక పోయారని, తీవ్రమైన రక్త స్రావంతో ఆర్తనాదాలు పెడుతున్న న్యాయవాదులకు సహాయ చర్యలు అందించటంలో ఘటన వద్దనే చూస్తున్న వారు అక్కడ వున్నవారు ఆర్టీసీ బస్సు లో వున్న ప్రయాణికుల్లో ఏ ఒక్కరు సామాజిక భాద్యత వహించినా న్యాయవాద దంపతులు బ్రతికే అవకాశం వుండేదని వారు ఆవేదన చెందారు.

న్యాయవాద వృత్తి కారణాలతోనే న్యాయవాద దంపతులు అమానుష్యంగా నడిరోడ్డుపై చంపబడితే న్యాయవాదుల సంఘాలు మోనం, ప్రేక్షక పాత్ర న్యాయవాదుల దురదృష్టం అని,వృత్తిపరంగా ఏ విధంగాను సంబంధం లేని వివిధ రాజకీయ అంశాలపై స్పందించే మన న్యాయవాది నేతలు ఈ ఘటన పై ఏ విధంగా స్పందిస్తారో అని ఎదురు చూడటమేనా ! ఏమైనా సరైన కార్యాచరణ వుంటుందా అని న్యాయవాదులు ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు.

లాయర్ ప్రాణానికే రక్షణ లేదు ఇక మనల్ని ఏమి కాపాడుతాడు అనే సామాన్యులకు ఊతపదంగా లాయర్ వృత్తి హేళన కాకుండా న్యాయవాదుల ఆత్మస్తైర్యానికి న్యాయవాద నేతలు జాతీయ స్థాయిలో స్పందించి భవిష్యత్ కార్యాచరణను తెలియపరచాలని, వామనరావు దంపతుల హత్యకేసు లో టీఆరెఎస్ ప్రభుత్వం పై ఆరోపణలు వస్తున్న తరుణంలో ఈ కేసును కేంద్ర హోమ్ శాఖ తో దర్యాప్తుకు ఆదేశించాలని ఆయన కోరారు.

న్యాయవాది దంపతులు హత్యా ఘటనపై కేసీఆర్ స్పందించి ప్రభుత్వం పరంగా తీసుకునే చర్యలు తెలియపరచాలని, రాజ్యాంగానికి ప్రధాన స్తంభాలుగా చెప్పుకునే న్యాయవాద వృత్తికి వారి కుటుంబాలకు రక్షణ లేకుండా పోతే సమాజంలో నేరస్తుల శాసనాలే అమలు జరుగుతాయని,
బయట సమాజంలో న్యాయవాది వ్యక్తి గత భద్రతకు , పాత్రికేయునల వ్యక్తిగత భద్రతకు ప్రత్యేక భద్రతా చట్టం అమలు చేయకపోతే నేరస్తులు చెలరేగిపోయే ప్రమాదం వుందని వారు హెచ్చిరించారు.

వామనరావు దంపతుల హత్యా ఘటన ఒక ప్రాంతానికో, రాష్ట్రానికో సంబందించినది కాదని జాతీయ స్థాయి లో న్యాయవాది నేతలు భావించాలని,
ఈ తరహా నేరాలు, న్యాయవాదులపై జరిగే దాడులు పునావృత్తం కాకూడదంటే నేడు యావత్ న్యాయవాదులు ఒక ప్రత్యేక కార్యాచరణ ద్వారా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని, న్యాయవాదుల భద్రత పైన, జర్నలిస్టుల రక్షణ పైన ప్రభుత్వం అలసత్వం వహిస్తే ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అని ఆయన పేర్కొన్నారు .

న్యాయవాదులపై జరిగే దాడులపైన ,
ఈ తరహా హత్యల పైన ప్రభత్వాలు కఠినంగా వ్యవహరించాలని, సగటు మనిషికి న్యాయం,సామజిక రక్షణ కల్పించటానికి చట్టాలు వున్నాయని, వాటిని కాపాడటానికి న్యాయవాదులు వున్నారని, అలాంటి న్యాయవాదిని కాపాడటానికి, రక్షించటానికి ప్రత్యేక చట్టాలు అవసరం ఎంతైనా అవసరం వుందని కేంద్ర ప్రభుత్వం భావించాలని, న్యాయవాదుల భద్రతకై పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం కొరకు బిల్లు ప్రవేశ పెట్టాలని అందుకు కేంద్ర న్యాయ శాఖ, లా కమిషన్ ఆఫ్ ఇండియా తక్షణమే సంయుక్తంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన తెలిపారు .

మహిళా న్యాయవాది అని మానవత్వం కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా వామనరావు భార్య నాగమణి ని సైతం హతమార్చిన కిరాతకం క్షమించరానిదని, ఈ తరహా కిరాతక హత్యలు ద్వారా న్యాయవాదుల ఆత్మస్తైర్యాన్ని దెబ్బతీయాలను కోవటం ముర్కత్వపు చర్యలుగా భావించాలని, వామనరావు దంపతుల హత్యను యావత్ భారతదేశ న్యాయవాదులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కేసు కేంద్ర హోమ్ శాఖ ద్వారా దర్యాప్తు చేయించే విధంగా కార్యాచరణ కు సిద్ధపడాలని,
సామాజిక భద్రత వుండాలి అంటే న్యాయవాదుల భద్రతకు, పాత్రికేయుల రక్షణకు ప్రత్యేక నిఘా
వ్యవస్థను, ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని
ఏ ఎల్ ఏ నుండి వారు కోరారు.

–మేడా శ్రీనివాస్,
ప్రధాన కార్యదర్శి,
ఆంధ్రా లాయర్స్ అసోసియేషన్ (ALA)

About The Author