ఫిబ్రవరి 19-02-2021 శుక్రవారం రాశి ఫలాలు..


శ్రీ శార్వరి నామ సంవత్సరము-మాఘ మాసము-శిశిరఋతువు-ఉత్తరాయణం

రథసప్తమి శుభాకాంక్షలు

శు. సప్తమి : ఉ|| 10:58 వరకు

కృత్తిక : తె|| 5:58 వరకు

వర్జ్యం : సా|| 4:26 6:14 వరకు –

దుర్ము : ఉ|| 8:53 9:40 వరకు

మ 12:44 – 1:31 వరకు

అమృత : రా॥ 3:15 – 5:04 వరకు

ఇంద్రయోగం : తె|| 4:33 వరకు

వణిజకరణం : ఉ| 10:58 వరకు

భద్రకరణం : రా|| 12:16 వరకు.ఈరోజు

రథసప్తమి, సూర్యజయంతి: అనూరుడు సూర్య రథసారధ్యం వహించిన రోజు రోజు మాదిరి స్నానం చేసిన తరువాత పంచ, ఉత్తరీయాలు కట్టుకొని ఈ క్రింది విధంగా సంకల్పం చెప్పుకొని మరల స్నానం చేయాలి

(ఉదయం 5:10 ని||ల లోపుగా) అద్యసర్వగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ ” మాఘేమాసి శుక్లే పక్షే సప్తమ్యాం తిథౌ, ఆయురారోగ్య సమప్రాప్తి పూర్వక సూర్యగ్రహణ కాలిక గంగాస్నాన జన్యఫల సమఫల ప్రాప్తి కామో అస్మిన్ జలాసయే స్నానమహం కరిష్మే” అని చెప్పుకొని తలమీద, బుజాలమీద జిల్లేడు ఆకులుకాని, రేగి ఆకులుకాని, చిక్కుడు ఆకులుకాని ఉంచుకకొని ఈ క్రింది మూడు శ్లోకాలు చెప్పుకుంటూ స్నానం చేయాలి

శ్లోకం: యధా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మేరోగం చ శోకంచ మాకరీ హంతు సప్తమీ ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం | మనోవాక్కాయజం యచ్ఛ జ్ఞాతజ్ఞాతేచ యే పునః || ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే | సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి |

అనంతరం ఈ క్రింది మంత్రంతో సూర్యభగవానుడికి అర్హ్యం ఇవ్వాలి అర్ఘ్యమస్త్రం: సప్త సప్తి వహ ప్రీత సప్తలోక ప్రదీపన

సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర.ఈ రోజు చేసే స్నానం వలన ఈ జన్మయందు, పూర్వజన్మయందు మనస్సుచేత,

వాక్కుచేత, శరీరంచేత తెలిసి, తెలియక చేసిన ఏడు విధాలైన పాపాలు

తొలగుతాయని ప్రతీతి

పాలు పొంగించి పాయసం చేసి సూర్యభగవానుడికి నివేదన చేయాలి

తూర్పుదిక్కుగా పాలు పొంగితే శుభం అని నమ్మిక రథసప్తమి, అచలాసప్తమి, భాస్కరీసప్తమీ, పుత్రప్రద ఆరోగ్య వ్రతాలు

ఆచరించవలసిన రోజు

5.ఈ రోజు యధాశక్తిగా బంగారం, రాగిపాత్రలు, గోధుమలు, గొడుగు, చెప్పులు దానం చయడం వలన సూర్యానుగ్రహం లభిస్తుంది

6. వీరశివాజీ అవతరించిన రోజు

గమనిక: సాధారణంగా ప్రతి సంవత్సరం స్త్రీలు ఈ రోజున అనేకమైన నోములు పడతారు. ఐతే ఈ సంవత్సరం శుక్రమౌడ్యమి ఉన్న కారణం చేత కొత్త నోములు

ఏవి పట్టరాదు.

About The Author