దుబాయ్ లో మహేష్ ఏం చేశాడో తెలుసా?
సర్కారువారి పాట షూటింగ్ కోసం దుబాయ్ వెళ్లాడు మహేష్. అక్కడో కీలకమైన షెడ్యూల్ పూర్తిచేశాడు. యాక్షన్ సీన్స్ లో పాల్గొన్నాడు. అయితే వీటితో పాటు తన ఫిట్ నెస్ పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాడు. టైట్ షెడ్యూల్ లో కూడా వ్యాయామాలు మరిచిపోలేదు మహేష్.
రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడారిలో షూటింగ్ చేసిన మహేష్, సాయంత్రం అయ్యేసరికి జిమ్ లో ప్రత్యక్షమయ్యేవాడు. అత్యంత కష్టమైన ఎక్సర్ సైజులు చేసేవాడు. అలా సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం 30 రోజుల పాటు కష్టపడ్డాడు.
మహేష్ పడిన కష్టాన్ని బయటపెట్టాడు అతడి ఫిట్ నెస్ ట్రయిలర్ మినాష్ గాబ్రియాల్. మహేష్ వర్కవుట్ చేస్తున్న ఫొటోను షేర్ చేసిన ఈ ట్రయినర్.. ఎడారిలో షూట్ చేసి, సాయంత్రం మళ్లీ జిమ్ చేయడం ఎంత కష్టమో చెప్పుకొచ్చాడు. అయితే మహేష్ మాత్రం ప్రతి వ్యాయామాన్ని గంటకు తగ్గకుండా చేసేవాడని, ఫైటర్ ఫిజిక్ కోసం చాలా కష్టపడ్డాడని చెప్పుకొచ్చాడు మినాష్.
దుబాయ్ లో ఆఖరి 30 రోజులు మహేష్ పడిన కష్టాన్ని పూసగుచ్చినట్టు వివరించిన ఈ ట్రయిలర్.. కష్టమైన జోన్-2 ట్రయినింగ్ ను మహేష్ ఎంతో ఇష్టంగా పూర్తిచేశాడని చెప్పుకొచ్చాడు.
ఎడారి షూటింగ్ లో అంత కష్టపడి, తిరిగి రాత్రిళ్లు ఆ రేంజ్ లో కసరత్తులు చేయడం మరో వ్యక్తి వల్ల కాదంటున్న ఈ ఫిట్ నెస్ నిపుణుడు.. మహేష్ తన వయసును వెనక్కు నెట్టి రోజురోజుకు మరింత బెటర్ అవుతున్నాడని కితాబిచ్చాడు