రూ.299కే బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్…
కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ తర్వాత ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. రోజు రోజుకి ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కారణంగా సంస్థలు కూడా తక్కువ ధరకే ఇంటర్నెట్ అందిస్తున్నాయి. తాజాగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా అతి తక్కువ ధరకే కొత్త ఇంటర్నెట్ ప్లాన్స్ తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ రూ.299, రూ.399, రూ.555 ధరకే కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ అందిస్తుంది. ఇంతకన్నా ఎక్కువ ధరకు కూడా బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ 2021 మార్చి 1 నుంచి అందుబాటులోకి వస్తాయి.బిఎస్‌ఎన్‌ఎల్ రూ.299 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కింద 100జీబీ డేటా 10 ఎంబీపీఎస్ హై-స్పీడ్‌తో అందిస్తున్నారు. డేటా పూర్తీ అయ్యాక ఇంటర్నెట్ స్పీడ్ 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ ప్లాన్ ఆరు నెలలే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత రూ.399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు మారాల్సి ఉంటుంది. బిఎస్‌ఎన్‌ఎల్ రూ.399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటే 10 ఎంబీపీఎస్ హై-స్పీడ్‌తో 200జీబీ డేటా అందిస్తారు. డేటా పరిమితి అయిపోయిన తర్వాత వేగం 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. రూ.555 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తీసుకుంటే 10 ఎంబిపిఎస్ వేగంతో 500జీబీ డేటా వస్తుంది. డేటా పూర్తైన తర్వాత ఇంటర్నెట్ వేగం 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. కొత్త వినియోగదారులు బిఎస్‌ఎన్‌ఎల్ రూ.299, రూ.399 ప్లాన్‌లు తీసుకోవాలంటే రూ.500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి.