ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా తీవ్రత..
*ఏపీలో కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతోంది.*
24 గంటల వ్యవధిలో నమోదయ్యే కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
ఒక్కరోజు వ్యవధిలో 31,719 నమూనాలను పరీక్షించగా 3,495 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది.
*అత్యధికంగా*
చిత్తూరు జిల్లాలో 719 గుంటూరు జిల్లాలో 501, విశాఖపట్నంలో 405,
కృష్ణా జిల్లాలో 306, శ్రీకాకుళం జిల్లాలో 293, ప్రకాశం జిల్లాలో 215, అనంతపూర్ జిల్లాలో 209
*అత్యల్పంగా*
వెస్ట్ గోదావరి జిల్లాలో 40,
ఈస్ట్ గోదావరి జిల్లాలో 41 కేసులు నమోదయ్యాయి.
ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9.25,401 కి చేరింది.
24 గంటల వ్యవధిలో కొవిడ్ చికిత్స పొందుతూ తొమ్మిది మంది మృతిచెందారు.
కోవిడ్ వలన చిత్తూరులో నలుగురు, గుంటూరు జిల్లాలో , కర్నూలు జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ,ప్రకాశం జిల్లాలో, మరియు శ్రీకాకుళం జిల్లాలో జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,300 కి చేరింది.
ఒక్కరోజులో 1,198 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా..
ప్రస్తుతం 20,954 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,54,29,391 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
ఇటీవల కాలంలో రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది.
తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి సంపూర్ణ ఆరోగ్యం తో పూర్తిగా కోలుకున్న కేసుల సంఖ్య 8,97,147