తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సీజన్ రెమిడెసివిర్ సరఫరా గురించి ప్రధాని శ్రీ నరేంద్రమోడితో టెలిఫోన్లో మాట్లాడి తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాల్సిందిగా అభ్యర్థించారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూరు నుంచి కర్నాటకలోని బల్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సీజన్ అందడంలేదని ప్రధాని దృష్టికి తెచ్చారు. మెడికల్ హబ్ గా హైదరాబాద్ మారినందున సరిహద్దు రాష్ట్రాల ప్రజలు కూడా హైదరాబాద్ మీదనే వైద్యసేవలకు ఆధారపడుతున్నారని తెలిపారు. మహారాష్ట్ర, చత్తీస్ గడ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలనుంచి హైదరాబాద్ కు కోవిడ్ చికిత్సకోసం చేరుకోవడం వలన హైదరాబాద్ మీద భారం పెరిగిపోయిందని సీఎం వివరించారు. తెలంగాణ జనాభాకు అదనంగా 50 శాతం కరోనా పేషెంట్లు ఇతర రాష్ట్రాలనుంచి రావడం వలన హైదరాబాద్ మీద ఆక్సీజన్, వ్యాక్సిన్, రెమిడెసివిర్ వంటి మందుల లభ్యతమీద పడుతున్నదని ప్రధానికి సీఎం తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం రోజుకు 440 మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ మాత్రమే రాష్ట్రానికి అందుతోందని దాన్ని 500 మెట్రిక్ టన్నులకు పెంచాల్సిందిగా ప్రధానిని కోరారు. రోజుకు తెలంగాణలో కేవలం 4900 రెమిడెసివిర్ ఇంజెక్షన్లు మాత్రమే అందుతున్నాయని వాటిని రోజుకు కనీసం 25000 కు పెంచాలని కోరారు. ఇప్పటి వరకు కేంద్రం 50 లక్షల వ్యాక్సిన్ డోసులను అందచేసిందని కానీ రాష్ట్ర అవసరాల దృష్ట్యా అవసరం మరింతగా వున్నదని కోరారు. రాష్ట్రానికి వ్యాక్సిన్లు ప్రతిరోజుకు 2 నుంచి 2.5 లక్షల డోసులు అవసరం పడుతున్నదని వాటిని సత్వరమే సరఫరా చేయాలని ప్రధాని శ్రీ మోడీకి సీఎం విజ్జప్తి చేశారు.
కాగా సీఎం విజ్జప్తి మేరకు ప్రధాని శ్రీ నరేంద్రమోడీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ సీఎం శ్రీ కేసీఆర్ తో మాట్లాడారు. ప్రధానికి సీఎం విన్నవించిన అంశాలన్నింటిని సత్వరమే రాష్ట్రానికి సమకూరుస్తామని, ఆక్సీజన్, వ్యాక్సిన్, రెమిడెసివిర్ సత్వర సరఫరాకు చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి సీఎంకు హామీ ఇచ్చారు. ఆక్సీజన్ ను కర్నాటక తమిళనాడుల నుంచి కాకుండా తూర్పు రాష్ట్రాలనుంచి సరఫరా జరిగేలా చూస్తామన్నారు.
కరోనా పరిస్థితుల పై ఇవాళ ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రణాళికా సంఘం ఉపాద్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు శ్రీ శేరి సుభాష్ రెడ్డి, శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, సీఎంఓ కరోనా ప్రత్యేక పర్యవేక్షణాధికారి శ్రీ రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ రిజ్వీ, హైల్త్ డైరక్టర్ శ్రీ శ్రీనివాసరావు, డిఎంఈ శ్రీ రమేశ్ రెడ్డి, శ్రీ కరుణాకర్ రెడ్డి, శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, శ్రీ గంగాధర్ తదితరలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులను కూలంకషంగా సమీక్షించారు. ప్రస్తుతం ఎంతవరకు ఆక్సీజన్ అందుతున్నది ఇంకా ఎంతకావలి వ్యాక్సిన్ లు ఎంత మేరకు అందుబాటులో వున్నవి రోజుకు ఎంత అవసరం? రెమిడెసివిర్ మందు ఏ మేరకు సప్లై జరుగుతున్నది రాష్ట్రావసరాలకు రోజుకు ఎన్ని అవసరం అనే విషయాలను ఆక్సీజన్ బెడ్ల లభ్యత వంటి విషయాల మీద పూర్తిస్థాయిలో చర్చించారు. రెమిడెసివిర్ తయారీ సంస్థలతో ఫోన్లో మాట్లాడిన సీఎం వాటి లభ్యతను మరింతగా పెంచాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 9500 ఆక్సీజన్ బెడ్లు వున్నాయని వాటిని హైదరాబాద్ సహా జిల్లాల్లో కలిపి మరో వారం రోజుల్లో వీటి సంఖ్యను మరో 5000 కు పెంచాలన్నారు. మెరుగైన ఆక్సీజన్ సరఫరాకోసం ఓక్కోటి కోటి రూపాయల చొప్పున 12 క్రయోజనిక్ ట్యాంకర్లను చైనా నుంచి వాయు మార్గంలో అత్యవసరంగా దిగుమతి చేయాలని సీఎస్ ను సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి చర్యలను అత్యంత వేగంగా పూర్తిచేయాలని సీఎస్ ను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ హాస్పిటల్స్, ఏరియా హాస్పిటల్స్ ల్లో మొత్తం 5980 కోవిడ్ అవుట్ పేషెంట్ సెంటర్లు ఏర్పాటుచేశామని వీటి సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.
సెకండ్ వేవ్ లో ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రుల్లో కలిపి లక్షా యాభై ఆరు వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా అందులో లక్షా ముప్పైవేలు (85 శాతం) కోలుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు. రోజువారిగా కరోనా పరిస్థితిపై ప్రతిరోజూ సాయంత్రం వైద్య అధికారులు రోజూ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించాలని సీఎం తెలిపారు. దీనికి డైరక్టర్ ఆఫ్ హెల్త్ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. అందుకు సంబంధించి పాజిటివ్ కేసుల వివరాలు కోలుకున్నవారి వివరాలు హోం క్వారెంటైన్ లో ఎంతమంది వున్నారు ప్రభుత్వ దవాఖానాల్లో ఎంతమంది చికిత్స పొందుతున్నారు ప్రయివేట్ దవాఖానాల్లో ఎంతమంది అనే వివరాలను పబ్లిక్ డోమైన్లో ప్రదర్శించాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ కోసం వైద్యశాఖ తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. వైద్య శాఖకు అవసరమైన నిధులను వెంట వెంటనే విడుదల చేయాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి నిధుల విడుదలకు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.
మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నవాల్లకు వారి నిర్ణీత సమయాన్ని అనుసరించి రెండో డోస్ వేసేందుకు ప్రాధాన్యతనివ్వాలని సీఎం ఆదేశించారు. ఆక్సీజన్ సరఫరా గురించి సమీక్షించిన సీఎం రాష్ట్రంలో ఆక్సీజన్ లభ్యతను పెంచేందుకు పలు ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా ఐఐసిటి డైరక్టర్ శ్రీ చంద్రశేఖర్ తో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే ఆక్సీజన్ నిల్వలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆరాతీసారు. వారి సూచనల మేరకు తక్షణమే 500 ఆక్సీజన్ ఎన్రిచర్లను కొనుగోలు చేయాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. త్వరలో మరిన్ని సమకూర్చాలని, తక్కువ సమయంలో ఆక్సీజన్ ఉత్పత్తిని జరిపే వ్యవస్థలను నెలకొల్పేందుక చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం సూచించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు గ్రామాలు పట్టణాల్లో సోడియం హైపోక్లోరైడ్ ను పిచికారీ చేయించి పరిసరాలను పరిశుభ్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలన్నారు.
ప్రజలకు ఇంటికే కోవిడ్ మెడికల్ కిట్లు:
———————————–
కరోనా విషయంలో ప్రజలు భయాందోళన గురికావద్దని సీఎం కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే కోవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు, ఎఎన్ఎం ల ద్వారా ఇంటింటికీ అందచేస్తామన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతో పాటు మందులు అందజేస్తారని తెలిపారు.
రాష్ట్రంలో లాక్ డౌన్ ఎందుకు విధంచగూడదనే విషయం గురించి సీఎం లోతైన విశ్లేషణ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ‘‘లాక్ డౌన్ వల్ల ఉపయోగం లేదు. తెలంగాణ రాష్ట్రం ఇండియాలో మోస్ట్ హాపెనింగ్ స్టేట్ కావడం వల్ల ఇక్కడ 25 నుంచి 30 లక్షల మంది ఇతర రాష్ట్రాలనుంచి కార్మికులు పనిచేస్తున్నారు. మొదటి వేవ్ కరోనా సమయంలో లాక్ డౌన్ విధించడం ద్వారా వీరందరి జీవితాలు చల్లా చెదురైన పరిస్థితిని మనం చూసాం. వీరంతా డిస్ లొకేట్ అయితే తిరిగి రావడం కష్టం. అదే సమయంలో రాష్ట్రంలో ధాన్యం పుష్కలంగా పండింది. తెలంగాణ వ్యాప్తంగా గ్రామల్లో 6144 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నిండివున్నది. ప్రస్థుతం అక్కడ వడ్ల కాంటా నడుస్తున్నది. వరి కొనుగోలు అంటే ఆశామాశీ వ్యవహారం కాదు. దీనిలో కింది నుంచి మీది దాక చైన్ సిస్టం ఇమిడి వుంటది. ఐకెపి కేంద్రాల బాధ్యులు, హమాలీలు, తూకం వేసేందుకు కాంటా పెట్టేవాల్లు మిల్లులకు తరలించే కూలీలు లారీలు ట్రాన్స్పోర్టు వెహికిల్స్ మిల్లులకు చేరవేయడం అక్కడ తిరిగి దించడం మల్లా అక్కడినుంచి ఎఫ్.సి.ఐ గోడౌన్లకు తరలించడం మల్లీ అక్కడ దించడం స్టాక్ చేయడం తిరిగి వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయడం… ఇంత వ్యవహారం వుంటది. ఈ మొత్తం వ్యవహారంలో లక్షలాది మంది భాగస్వాములౌతారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి రైసు మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు ఏమౌతారు? లాక్ డౌన్ విధిస్తే ఇంతమంది ఎక్కడపోతారు? కార్మికులు చల్లాచెదురైపోతే తిరిగి వారిని రప్పించడం ఎట్లా? కోనుగోలు చేయకపోతే పండించిన వరి ధాన్యాన్ని రైతు ఎక్కడ పెట్టుకుంటాడు? మొత్తం ధాన్యం కొనుగోల్ల వ్యవస్థ ఎక్కడికక్కడ స్థంభించి పోయే ప్రమాదమున్నది. తద్వారా సంభవించే సంక్షోభం ఘోరంగా వుండే ప్రమాదం వుంది. అదే సమయంలో నిత్యావసర సరుకులు, పాలు కూరగాయలు పండ్లు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులు, ప్రసవాలు, పారిశుధ్య కార్యక్రమాలు వంటి అత్యవసర కార్యక్రమాలను ఆపివేయలేం. అదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాక్సీన్లు, మెడిసిన్, ఆక్సీజన్లను ఇతర నిత్యావసరాలను సరఫరా చేసుకుంటున్నం ఓక వేల లాక్ డౌన్ విధిస్తే వీటన్నిటికి ఆటంకం ఏర్పడుతది. ఇన్ని కారణాల వల్ల ప్రభుత్వమే ఒక భయానక పరిస్థితిని సృష్టించినట్లవుతుంది అందుకు ప్రభుత్వం సిద్దంగా లేదు… కాబట్టి లాక్ డౌన్ విధించలేం.
అదే సమయంలో కేసులు ఎక్కువగా వున్న ప్రాంతాలను గుర్తించి వాటిని, మైక్రోలెవల్ కంటైన్మెంట్ జోన్లను ప్రకటించి కరోనా నిరోధక చర్యలను తక్షణమే చేపడుతాం.. అని సీఎం వివరించారు. సీఎం మాట్లాడుతూ… ‘‘అదే సందర్భంలో పరిశ్రమలు ఉన్నఫలంగా మూతపడితే అంతా ఆగమాగం కాదా. క్యాబ్, ఆటోలు, డ్రైవర్ల పరిస్థితి ఏమిటి? కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధికోల్పోయే పరిస్థితి తలెత్తి మొత్తం వ్యవస్థ కుప్పకూలే ప్రమాదమున్నది. కరోనా ఏమోగాని ఆకలి సంక్షోభం తలెత్తే ప్రమాదమున్నది. గొంతు పిస్కినట్టు చేస్తే మొత్తం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నది. కాబట్టి గతంలో అనుభవాలను దృష్టిలో వుంచుకోని లాక్ డౌన్ ను విధంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.’’ అని సీఎం స్పష్టం చేశారు.
కరోనా నియంత్రణ కోసం ప్రజలు కూడా పూనుకోవాలనీ, ప్రతి వ్యక్తీ స్వచ్ఛందంగా కరోనా మీది యుద్ధంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. సమిష్టిగా అందరం కలిసి కొట్లాడితేనే కరోనా అంతమౌతుందని అన్నారు. మేధావులు, బుద్దిజీవులు ఈ దిశగా ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు.
కరోనా నియంత్రణలో ప్రాణాలకు తెగించి పాటుపడుతున్న వైద్య ఆరోగ్యశాఖకు కరోనా అభివందనాలు తెలియచేశారు. వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు తదితర వైద్య సిబ్బంది గొప్ప సేవ చేస్తున్నారని వారి కృషి త్యాగం గొప్పదని కొనియాడారు. రెండో వేవ్ మే 15 తర్వాత కరోనా తీవ్రత తగ్గిపోతుందని రిపోర్టులు సూచిస్తున్నాయన్నారు. వ్యాధి నిరోధానికి ఎవరికివారే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలే స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. గుంపులు గుంపులుగా తిరగొద్దని పెండ్లిల్లలో వందకు మించి జమ కావద్దని తెలిపారు. పరిశుభ్రత పాటించాలని, సానిటైజర్లు వాడాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని తెలిపారు. ఇటువంటి జాగ్రత్తలే శ్రీరామ రక్షగా పేర్కొన్నారు.
Chief Minister Sri K. Chandrashekar Rao has clarified that lockdown would not be imposed in the Telangana state. He said the imposition of lockdown would make life stand still and would lead to the total collapse of the financial system. The CM took this decision after examining the situation in the states where the lockdown was imposed and where the positive cases have not come down as well as taking into account the past experiences. The CM spoke to Prime Minister Sri Narendra Modi over the phone about the supply of the required vaccines, Oxygen and Remdesivir and urged him to supply the same immediately. The CM brought to the notice of the PM that the Oxygen supplies allocated to the state from Sriperambadur and in Tamil Nadu and Bellary in Karnataka have not been supplied so far. Since Hyderabad became a medical Hub, people from the bordering states are also depending on Hyderabad for medical treatment. The CM explained that since people from Andhra Pradesh, Maharashtra, Chhattisgarh, Karnataka are coming to Hyderabad for treatment there is an alarming increase of burden on the city. The CM told the PM that there are 50 percent more Corona patients than the Telangana people are coming to Hyderabad for treatment it had an adverse impact on the availability of Oxygen, vaccines and injections like the Remdesivir. The CM said as of date there is the availability of 440 MT of Oxygen per day and it should be increased 500 MT per day. The availability of Remdesivir is only 4900 and it should be increased to 25000. He said the Centre had so far given only 50 Lakh doses of vaccine and it should also be increased based on the needs of the state. The CM requested the PM to ensure the supply of 2 to 2.5 Lakh doses of vaccine per day and it should be supplied immediately.
Meanwhile, on the request made by the CM and instructions from the PM, Union Minister Sri Piyush Goyal spoke to the CM. Sri Piyush Goyal assured the CM that all the requests made by the CM would be fulfilled and action would be taken to supply adequate quantities of vaccine, Oxygen and Remdesivir would be supplied to the State. The Union Minister said Oxygen would be supplied from the Eastern states instead of TN and Karnataka states.
The CM held a high-level review meeting at Pragathi Bhavan here on Thursday on the situation arising out of Corona. In this meeting, State Planning Commission Vice Chairman Sri Vinod Kumar, Chief Secretary Sri Somesh Kumar, Principal Secretary (Finance) Sri Ramakrishna Rao, CM Secretary Sri Bhoopal Reddy, CMO Corona Monitoring Special officer Sri Rajsekhar Reddy, Principal Secretary (Medical and Health) Sri Rizvi, Health Director Sri Srinivas Rao, DME Sri Ramesh Reddy, Sri Karunakar Reddy, Sri Chandrashekhar Reddy, Sri Gangadhar, MLCs Sri Seri Subhash Reddy, Sri Palla Rajeshwar Reddy and others participated in the meeting.
The CM made an in-depth review about the Corona situation prevailing in the State. The CM discussed at length how much Oxygen supply is available and how much is required? Availability of the vaccines, supply of the Remdesivir and how much is required for the state’s needs? Availability of beds with Oxygen etc., The CM spoke to the companies manufacturing the Remdesivir and asked them to increase the supply. He said, as of date there are 9500 beds with Oxygen are available in Government hospitals and wanted 5000 more to be added within a week all over the state. The CM has instructed the CS to make arrangements to airlift 12 Cryogenic tankers from China for a better Oxygen supply at a cost of Rs one crore each. The CM asked the CS to make these arrangements immediately. He said that 5980 Covid outpatient centres are created all over the State in PHCs, Community hospitals and area hospitals and wanted people to utilise the services. The officials informed the CM that in the state, so far 1.56 Lakh positive cases were reported and of this 1.30 Lakh 85 percent have recovered. The CM instructed the medical health officials to brief media everyday evening on the Corona situation. He wanted the Director of Health to take this responsibility. The CM also instructed that all the information and data on the number of positive cases, how many be recovered, how many are there in the home quarantine, how many are getting treated in the government hospitals, how many are there in the private hospitals, etc., on the public domain. The CM wanted that a special officer should be appointed to monitor the measures to contain the virus spread in the state. The CM instructed Principal Secretary (Finance) Sri Ramakrishna Rao to release the funds required for the medical and health department immediately. He also wanted a special officer to be appointed to release the funds. The CM instructed that all those who took the first dose of the vaccine should be given the second dose on priority.
The CM who reviewed the availability of Oxygen had also made attempts to increase its supply. The CM spoke to IICT Director Sri Chandrashekhar over the phone and asked him about the measures taken to increase the Oxygen reserves. Based on their suggestions, the CM instructed the medical and health officials to purchase 500 Oxygen enrichers. The CM suggested that more enrichers should be added immediately and wanted setting up of a system that generated Oxygen in a short time. He wanted officials from the Panchayat Raj, Municipal department to spray Sodium Hypochloride to clean the environment. He wanted public representatives to become the partners in the programme.
Covid medical Kits for every household
——————————————–
The CM urged the people to utilise the Covid Kits supplied by the government. He said the Kits would be provided through Asha workers and ANMs. Along with the medicines, there will be pamphlets on the precautions to be taken for the curtailment of Corona.
The CM did an in-depth analysis on why lockdown should not be imposed in the State.
Speaking on the occasion, the CM said,” There is no use imposing lockdown. Since Telangana state is the most happening state in the country, 25 to 30 Lakh workers from other states are here working. We have seen how their lives were adversely impacted by the lockdown we imposed during the first wave. If they are dislocated, they will not come back. Moreover, there is a bumper yield of the Paddy in the State. Paddy is stocked in 6144 procurement centres in the state and they are weighing the Paddy. Purchasing Paddy is not a simple process. There is a chain system involved from bottom to top. There is the involvement of the IKP Centre incharges, Hamalis, workers, transport staff, workers at the rice mills, FCI godowns, etc., There are lakhs of people involved in the process. What will happen to the workers who came from other states and working in the rice Mills? What will happen to them if there is a lockdown? If the workers go helter-skelter how would one get them back? If the Paddy is not purchased where will the farmer go? There is a danger of the entire Paddy purchasing process coming to a standstill if the lockdown is imposed. And it may lead to crisis. At the same time, we cannot stop the supply of essential commodities, milk, vegetables, fruits, emergency medical services, deliveries, sanitation and other such emergency and essential services. We are also importing from other states, vaccines, medicines, injections, etc., they will be affected if the lockdown is imposed. If the lockdown is imposed, the government will become responsible for creating a panic situation. Hence the government is not ready it impose lockdown. However, we will identify the areas where the cases are more and declare them as Micro level Containment zones and take the required measures,” the CM explained.
The CM also said that if the industries are closed down lakhs of people lose their livelihood and working-class as the cab drivers would be in a dire situation. Leave aside Corona; the entire economic situation will collapse leading a deep crisis. Hence the government has decided not to impose any lockdown,” the CM said.
The CM also urged people to take part in the fight against Corona voluntarily. He said only through united efforts by everyone that victory over the Pandemic can be achieved. He wanted intellectuals and other scholars to educate people in this regard. The CM congratulated the medical and health department staff for rendering their services putting their lives at stake. Doctors, Nurses, Asha workers, ANMs and other medical staff are appreciated by the CM for their selfless services. The CM said that the reports suggested the intensity of the second wave of Corna would come down by May 15. He wanted people to take precautionary measures to curtail the virus and they asked them to exercise restrain by themselves. He advised people not to move in-crowd, more than 100 should not attend the marriage ceremonies, frequent use of sanitizers, wearing masks and maintaining physical distance should be observed at all times. Such precautions would only prevent the virus from spread, the CM said.