కేజీ మట్టి.. ఆరున్నర లక్షల కోట్లు!!


అవును.. కేజీ మట్టి కోసం అన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నమాట నిజమే. కాకపోతే అది భూమ్మీద మట్టి కోసం కాదు. అంతరిక్షంలో అదీ అంగారక గ్రహం​ మీద మట్టి కోసం. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అధికారికంగా ప్రకటించింది. మార్స్​ మీద దిగిన నాసా పర్సీవరెన్స్ రోవర్ ఇదివరకే పరిశోధనలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అత్యంత విలువైందిగా భావిస్తున్న అక్కడి​ మట్టిని భూమ్మీదకు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది నాసా. ఈ ప్రాజెక్టు కోసం నాసా 9 బిలియన్ల డాలర్లు ఖర్చు చేయబోతోంది. ఒకవేళ అంగారక గ్రహం మీద మట్టి భూమ్మీదకు చేరితే గనుక.. ఇప్పటిదాకా భూమ్మీది అపురూపమైన వస్తువులలో అదే అగ్రస్థానంలో ఉంటుంది.దాదాపు రెండు పౌండ్ల మట్టి(దాదాపు కేజీ)ని మట్టిని మార్స్​ నుంచి తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మూడు దశలో ఈ ప్రాజెక్టు ఉండబోతుంది. అయితే ఈ శాంపిల్ సేకరణ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి రెండేళ్లు పట్టే అవకాశం ఉందని నాసా చెబుతోంది. ఇక ఆ మట్టిని భూమ్మీదకు తేవడానికి మరో పదేళ్లకాలం పైనే పట్టొచ్చని అంచనా. కాగా, మార్స్​ మట్టి కోసం ఇంత ఖర్చు చేయబోతున్న నాసా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కూడా.

About The Author