రఘురామ సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదుపై కదిలిన లోక్సభ సెక్రటేరియట్…


ఏపీ సీఎం డిజిపి ఇతర పోలీసు అధికారులపై రఘురామకృష్ణంరాజు ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు పై స్పందించిన లోక్సభ సెక్రటేరియట్.

వెంటనే సమగ్ర వివరాలు అందజేయాలని హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా ను కోరిన లోక్సభ సెక్రటేరియట్.

జూన్ రెండో తేదీన రఘురామకృష్ణరాజు ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన లేఖపై పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశం.

తనను అక్రమంగా అరెస్టు చేసి, కస్టోడియల్ టార్చర్ కు గురిచేశారని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన ఎంపీ.

తన సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్, డి జి పి, సిఐడి ఏ డి జి, గుంటూరు అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ లకు సభా హక్కుల ఉల్లంఘన పిర్యాదు చేసిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు.

రఘురామకృష్ణం రాజును కస్టోడియల్ టార్చర్ కు గురి చేయడం పై ఆయన కుమారుడు భరత్, టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు కనకమేడల రవీంద్ర కుమార్ ల లేఖలోని అంశాలపైన వివరాలు ఇవ్వాలని హోం శాఖ ను కోరిన లోక్సభ సెక్రటేరియట్.

15 రోజుల్లోగా సమగ్ర నివేదిక ను హిందీ, ఇంగ్లీష్ కాపీ లలో తమకు అందజేయాలన్న లోక్సభ సెక్రటేరియట్.

About The Author