భగవంతుడు నిర్మించిన నగరం ” ద్వారక “…
భగవంతుడు నిర్మించిన నగర0″ద్వారక ”
— అవును, రామాయణం నిజం.. మహా భారతం నిజం.. ద్వాపర యుగం నిజం…
. . . . జై శ్రీకృష్ణ . . . . .
సాగర గర్భంలో మునిగిపోయిన కృష్ణ ద్వారక……………..
192 కిలోమీటర్ల పొడవు… 192 కిలోమీటర్ల వెడల్పు.. 36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. బారులు తీరిన వీధులు.. వీధుల వెంట బారులు తీరిన చెట్లు.. రాయల్ ప్యాలెస్‌లు..
రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు.. కమర్షియల్ మాల్స్.. కమ్యూనిటీ హాల్స్.. క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నాడే అపూర్వ మహానగరం.. రత్నస్తంభాలు.. వజ్ర తోరణాలు.. సాటిలేని ఆర్కిటెక్చర్..
సముద్రం మధ్యలో మహా నిర్మాణం.. జగన్నాథుడి జగదేక సృష్టి..
క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల నాటి లెజెండ్ సిటీ… ద్వారక..
ఇప్పుడు సాగర గర్భంలో.. మన నాగరికత.. మన సంస్కృతి.. మన ప్రతిభకు పట్టం కట్టిన నాటి కాస్మోపాలిటన్ సిటీ..
ద్వారక —————————- అవును, రామాయణం నిజం.. మహా భారతం నిజం.. ద్వాపర యుగం నిజం..
వేల ఏళ్ల నాటి మన సంస్కృతి నిజం.. అద్భుతమైన మన నాగరికత నిజం.. అపూర్వమైన మన సైన్స్ నిజం.. సాటి లేని మన ఇన్వెన్‌షన్స్ నిజం..
ఇందుకు ఈ సముద్ర గర్భంలో కనిపిస్తున్న మహానగరమే తిరుగులేని ఉదాహరణ.. ………
ఒక్కమాటలో చెప్పాలంటే.. ద్వారక.. గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా..
1980వ దశకంలో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. పశ్చిమాన గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది..
మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని ఈ నగరం బయటి ప్రపంచానికి చాటి చెప్పింది..
ఇదే ఇవాళ మనం చెప్పుకుంటున్న ద్వారక.. .కృష్ణుడి ద్వారక..
విశ్వకర్మ నిర్మించిన ద్వారక.. ఈ తవ్వకాల్లో ఏవో చిన్న చిన్న రాళ్ల కట్టడాలు దొరికాయనుకుంటే పొరపాటే.. ………..
శిథిలాల రూపంలోనే అయినా, ఒక మహా నగరమే బయటపడింది.. సముద్రం అట్టడుగున ముందుకు వెళ్తున్న కొద్దీ వెళ్తున్నట్లే.. కిలోమీటర్ల కొద్దీ, అంతమెక్కడో తెలియనంత విస్తీర్ణంలో అపురూపమైన నిర్మాణం వెలుగు చూసింది.. ……..
మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆర్కియాలజిస్ట్ ఏస్.ఆర్. రావు నేతృత్వంలో సాగిన ఈ పరిశోధనలు ఈ మహానగరాన్ని దాదాపు క్రీస్తుపూర్వం 3150 సంవత్సరాల క్రితం నాటిదిగా నిర్ధారించారు..
మహాభారత కాలంలో కృష్ణుడు నిర్మించిన ద్వారకగా స్పష్టమైంది..
శ్రీకృష్ణుడు జన్మించిన సమయం క్రీస్తుపూర్వం3222 జూలై 27 శుక్రవారం అర్ధరాత్రి…
మధురలో కంసుడి జైలులో జగద్గురువు జన్మించాడు.. కంసుడిని చంపిన తరువాత మధురను ఏలుతున్న కృష్ణుడిపై మగధ రాజు జరాసంధుడు, కాలయవనుడితో కలిసి 17 సార్లు యుద్ధం చేశాడు..
చివరకు ప్రజలకు రక్షణ కల్పించటం కోసం ఏకంగా పశ్చిమ తీరానికి వచ్చి గోమతి తీరంలో ద్వారకను కృష్ణుడు నిర్మించాడు..
శ్రీకృష్ణ నిర్యాణానంతరం సునామీ రూపంలో ప్రళయం వచ్చి ద్వారక సాగర గర్భంలో కలిసిపోయింది.
కాలగర్భంలో ఆనవాలే లేకుండా పోయింది. మనకంటూ చరిత్రే లేదని అనిపించేలా అదృశ్యమైంది.. ——————- ద్వారక సముద్రంలో మునిగిపోయిన తరువాత భారత్ నాగరికత కూడా మాయమైపోయింది..
మనం అన్నీ మర్చిపోయాం.. మన కల్చర్ గురించి మనకు అందించేవాళ్లే లేకుండా పోయారు.
ఇప్పుడు అయిదు వేల ఏళ్ల తరువాత ఒక్కటొక్కటిగా బయటపడుతున్న మన మూలాల్ని చూస్తుంటే మనకే కాదు..
ప్రపంచ దేశాలన్నింటికీ కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. సాగర గర్భంలో బయటపడిన ద్వారక నగరం ఆషామాషీ నగరం కానే కాదు..
ఇవాళ మనకు తెలిసిన గొప్ప గొప్ప నగరాలకంటే వెయ్యి రెట్లు అడ్వాన్స్‌డ్ మెట్రోపాలిటన్ సిటీ అని చెప్పవచ్చు.
శ్రీకృష్ణుడు పర్‌ఫెక్ట్ ప్లాన్‌తో ద్వారక నిర్మాణానికి పూనుకున్నాడు.. విశ్వకర్మతో ఈ నగరాన్ని నిర్మించాడు..
గోమతి నది, సముద్రంలో కలిసే చోటును నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు.
అక్కడ సుమారు 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం కూడా అలాంటిఇలాంటి సెట్టింగ్ కాదు. ద్వారకలో తొమ్మిది లక్షలు..
అవును.. అక్షరాలా తొమ్మిది లక్షల రాజభవనాలు ఉండేవి.. శ్రీకృష్ణుడి అష్ట భార్యలతో పాటు 16వేల మంది గోపికలకూ ఒక్కో రాజభవనం ఉండేదిట..
ఈ భవనాలన్నీ కూడా క్రిస్టల్స్, ఎమరాల్డ్, డైమండ్స్ వంటి అపురూప రత్నాలతో నిర్మించారు..
ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్ గోల్డ్‌గా ద్వారకను చెప్పుకోవాలి.. పొడవైన అతి పెద్ద పెద్ద వీధులు..
వీధుల వెంట బారులు తీరిన చెట్లు.. మధ్యమధ్యలో ఉద్యానవనాలు.. వాటి మధ్యలో రాజభవనాలు..
ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు.. వ్యవసాయ క్షేత్రాలు.. ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగరం ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో..
అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక..
నగర నిర్మాణం ఇళ్లు, వీధుల నిర్మాణంతోనే అయిపోయిందనుకుంటే పొరపాటే.. హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ కమర్షియల్ జోన్లు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు..
ఇప్పటికే కట్టిన నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపట్లు పడుతున్నారు.. కానీ, ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి..