ఆగస్టు నెలలో 15 రోజులపాటు బ్యాంకులు బంద్
మీకు బ్యాంకులో ఏదైన పని ఉందా..? ఆగస్టు నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు తెరుచుకుంటాయి. బ్యాంకులు ఎప్పుడు మూసివేయబడతాయి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. బ్యాంకు లావాదేవీలను చేసుకునే వినియోగదారులకు సెలవు దినాలు తెలుసుకుని ముందుగా ప్లాన్ చేసుకుంటే.. పనికి సులభంగా ఉంటుంది. మొత్తంగా ఆగస్టు నెలలో దేశ వ్యాప్తంగా 15 రోజులు బ్యాంకులు పనిచేయవు. బ్యాంకు హాలిడేస్.. రాష్ట్రం ప్రాతిపదికన మారుతుంటాయి. ఒక రాష్ట్రంలో సెలవు ఉంటే మరో రాష్ట్రంలో హాలిడే ఉండకపోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ క్లోజ్ ఉన్నా కూడా ఆన్ లైన్ బ్యాంకింగ్ సర్వీసులు పొందవచ్చు. ఏటీఏం, మొబైల్ బ్యాంకింగ్, ఆన్ లైన్ బ్యాంకింగ్ వంటి సేవలు లభిస్తాయి.
కాగా..తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులు మాత్రమే బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ప్రతి ఆదివారం, రెండో శనివారం , నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులు ఉంటాయనే సంగతి తెలిసిందే.
ఆగస్టులో సెలవులు ఇవే..
ఆగస్టు 1- ఆదివారం
ఆగస్టు 8- ఆదివారం
ఆగస్టు 13- దేశభక్తుల దినోత్సవం
ఆగస్టు 14- రెండో శనివారం
ఆగస్టు 15- స్వాతంత్ర్య దినోత్సవం, ఆదివారం
ఆగస్టు 16- పార్శీ నూతన సంవత్సరాది
ఆగస్టు 19- మొహర్రం
ఆగస్టు 20-మొహర్రం/ఫస్ట్ ఓనం
ఆగస్టు 21- తిరువోనం
ఆగస్టు 22- ఆదివారం
ఆగస్టు 23- శ్రీ నారాయణ గురు జయంతి
ఆగస్టు 28- నాలుగో శనివారం
ఆగస్టు 29- ఆదివారం
ఆగస్టు 30- జన్మాష్టమి
ఆగస్టు 31: శ్రీ కృష్ణ అష్టమి