ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలెర్ట్.. మరో మూడు రోజుల పాటు వర్షాలు..


బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. రెండు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ముసురు పట్టింది. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిన్న నైరుతి బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఆవర్తనం ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

About The Author