దాల్చిన చెక్కతో ప్రోస్టేట్ క్యాన్సర్ మాయం..


దాల్చిన చెక్కతో ప్రోస్టేట్ క్యాన్సర్ మాయం.. హైదరాబాద్ ఎన్ఐఎన్ అధ్యయనంలో వెల్లడి..

_ఎలుకలపై జాతీయ పౌష్టికాహార సంస్థ అధ్యయనం_

_దాల్చినచెక్కలో సినామల్‌డిహైడ్, ప్రొసైనిడిన్-బి2 పదార్థాలతో క్యాన్సర్‌కు అడ్డుకట్ట_

_దాల్చిన చెక్కతో తగ్గుతున్న ఎముకల క్షీణత_

_వంటల్లో ఉపయోగించే దాల్చినచెక్కతో ప్రోస్టేట్ క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేయొచ్చని హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) అధ్యయనంలో వెల్లడైంది. అందులో ఉండే సినామల్‌డిహైడ్, ప్రొసైనిడిన్-బి2 పదార్థాలు ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్‌ను నిరోధిస్తాయని ఎలుకలపై జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ మేరకు ఎన్ఐఎన్ నిన్న ఓ ప్రకటనలో తెలిపింది._

_అధ్యయనంలో భాగంగా దాల్చినచెక్కలో ఉండే సినామల్‌డిహైడ్, ప్రొసైనిడిన్-బి2 పదార్థాలను ఆహారంలో కలిపి ఎలుకలకు ఇచ్చారు. ఆ తర్వాత క్యాన్సర్ కారక కణాలు ఎలుకలకు ఇచ్చారు. 16 వారాల తర్వాత తిరిగి పరీక్షలు నిర్వహించగా దాల్చినచెక్క, అందులోని ఔషధ గుణాల వల్ల 60-70 శాతం ఎలుకలు ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ ప్రభావానికి గురి కాలేదని గుర్తించారు._

_దాల్చినచెక్కలోని ఔషధ గుణాలు ఆక్సిడేటివ్ ఒత్తిడిని నిరోధిస్తాయని, దీంతో ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ కణాల వ్యాప్తి తగ్గుతుందని ఎన్ఐఎన్ ఎండోక్రోనాలజీ విభాగం అధిపతి డాక్టర్ అయేషా ఇస్మాయిల్ తెలిపారు. దాల్చినచెక్క కారణంగా ఎముకల క్షీణత కూడా తగ్గిందని పేర్కొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు అంతర్జాతీయ జర్నల్ క్యాన్సర్ ప్రివెన్షన్ రిసెర్చ్‌లో ప్రచురితమయ్యాయి…!!_

About The Author