పట్టణ ప్రజాసమస్యలపై యువత పోరాటాలకు సిద్ధం కావాలి-డివైఎఫ్ఐ

పట్టణ ప్రజాసమస్యలపై యువత పోరాటాలకు సిద్ధం కావాలి-డివైఎఫ్ఐ*

పట్టణంలోని ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా యువకులు పోరాటాలకు సిద్ధం కావాలని డివైఎఫ్ఐ మాజీ డివిజన్ కార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు.
స్థానిక డివైఎఫ్ఐ కార్యాలయంలో పట్టణ కమిటీ సమావేశం జరిగింది .*ఈ కార్యక్రమానికి కో-కన్వీనర్ రాము అధ్యక్షత వహించారు.అనంతరం *డివైఎఫ్ఐ పట్టణ కన్వీనర్ శివ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వం యువకులను గత నాలుగేళ్ల నుంచి మోసం చేస్తూ వచ్చిందని ముఖ్యంగా జాబ్ రావాలంటే బాబు రావాలని లక్షల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని నెరవేర్చకుండా కేవలం రూపాయలు మాత్రమే నిరుద్యోగ భృతి చెల్లించి దేశంలో మేమే ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం దుర్మార్గమని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా యువకులను నిరుద్యోగులను మోసం చేసిందని మళ్లీ ఎన్నికలు వస్తున్న మాయమాటలు చెప్పేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. అదేవిధంగా నంద్యాల పట్టణంలో బ్తెటి పేట లోని కమెల వ్యర్థ పదార్థాలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు తెలిపిన లాభం లేకుండా పోయిందని దీనిపైన రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, అదేవిధంగా పట్టణంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం డివైఎఫ్ఐ గా యువకులను చైతన్యం చేసి పోరాటం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కో కన్వీనర్ ఇంతియాజ్ నాయకులు అల్లా బకాష్ , శ్రీకాంత్, ఆదినారాయణ, రవి శ్రీనివాసులు, రవి పాల్గోనడం జరిగింది

About The Author